Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
శృంగారంలో పాల్గొంటున్నా పిల్లలు పుట్టట్లేదా?.. అయితే దానికి కారణం ఇదే!
పెళ్లి చేసుకున్న ఒక ఆరు నెలల తరువాత ప్రతి ఒక్కరికీ ఒకటే బాధ ఉంటుంది. అదే పిల్లలు ఎప్పుడు పుడతారని. ఆరు నెలల్లో శుభవార్త చెప్పకపోతే ఇరుగుపొరుగు వారితో పాటు ఇంట్లోని తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎప్పుడు అనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యుల కోసం శృంగారంలో పాల్గొంటున్నా కొందరికి మాత్రం పిల్లలు పుట్టరు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కొందరికి శారీరక సమస్య ఉంటే, మరికొందరికి మానసిక సమస్య కూడా ఉండొచ్చు.
అయితే శృంగారంలో పాల్గొంటున్నా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి? స్త్రీలలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? పురుషుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది స్టోరీలో తెలుసుకుందాం.

సంతాన లేమికి కారణాలు
స్త్రీలలో..
స్త్రీలలో సాధారణంగా ప్రతినెలా ఒక పరిపక్వ అండం విడుదలవుతుంది. అయితే ఈ ప్రక్రియలో ఏదైనా అంతరాయం ఏర్పడితే గర్భం దాల్చడం చాలా కష్టం అవుతుంటుంది. అండం గర్భం దాల్చాలంటే అండవాహిక అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ వాహికలో ఏదైనా సమస్య ఏర్పడితే గర్భం దాల్చడం కష్టం. ఎందుకంటే ఈ వాహికలో అంతరాయం ఏర్పడితే.. గర్భాశయం బయటనే కణాలు పెరుగుతాయి. దీంతో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో హార్మోన్లు, అండంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది. క్రమంగా గర్భం దాల్చకుండా ఉంటారు.
పురుషులలో..
స్త్రీలు గర్భం దాల్చాలంటే పురుషులలోని శుక్రకణాలు అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తాయి. అయితే పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉన్నా లేదా అవి ఉండాల్సిన పరిమాణంలో లేకపోయినా గర్భం దాల్చడం చాలా కష్టం. ఎందుకంటే అవి తక్కువగా ఉన్నా, సరైన పరిమాణంలో లేకపోయినా శుక్రకణాలు అండాన్ని చేరుకోలేవు. దీంతో గర్భం దాల్చరు.
వృషణాల్లో వాపు, లేదా ఇతర సమస్యల కారణంగా ఈ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. లాగే బలహీనంగా మారుతాయి. దీంతోపాటు శుక్రకణాలు బయటికి రావడానికి వీర్యనాళాలు చాలా ముఖ్యం. ఇందులో ఏదైనా అడ్డుపడినా గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది.
ఈ అలవాట్లు కూడా ఓ కారణమే..
పురుషులు, స్త్రీలలో ఉండే సాధారణ సమస్యలతో పాటు ఇద్దరికీ ఉండే కొన్ని వ్యసనాలు, సమస్యలు కూడా గర్భం దాల్చకుండా ఉండడానికి కారణమవుతాయి. ధూమపానం, మద్యపానం, అధిక బరువు, ఒత్తిడి వంటివి సంతానలేమికి దారితీస్తాయి.మహిళల్లో వయసు పెరిగే కొద్దీ గర్భం దాల్చడం కష్టం.
సంతానలేమికి పరిష్కారాలు:
సంతానలేమికి ప్రస్తుతం మార్కెట్లో అనేక చికిత్సలు ఉన్నాయి. ఎన్నో రకాల ఆసుపత్రులు చికిత్సను అందజేస్తున్నారు. గర్భం దాల్చకుండా ఉన్న వ్యక్తులు ఓసారి వైద్యులను సంప్రదించి దానికి తగినట్లుగా చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు పండుతారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF). ప్రయోగశాలలో గుడ్డును ఫలదీకరణం చేసి గర్భాశయంలో ప్రవేశపెట్టే పద్ధతి. శుక్రకణాన్ని నేరుగా గుడ్డులోకి ఇంజెక్ట్ చేసే పద్ధతుల ద్వారా కూడా గర్భం దాల్చేలా చేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications