Latest Updates
-
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే!
పచ్చి మాంసం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం!
ఇది పండుగ సమయం. చాలామంది ఇంట్లో మాంసం ఉంటుంది. అయితే పండుగనాడు మిగిలిపోయిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వండుకొని తింటూ ఉంటారు. అయితే పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల.. అనేక ప్రమాదాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు ఇన్ఫెక్షన్ బారిన పడే అవాశముందని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.
అయితే పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ఎలా మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయనేది కింద స్టోరీలో పొందుపరచాము. అది ఒకసారి చదవండి..
యూరినరీ ఇన్ఫెక్షన్:
ఫ్రిజ్‌లో నిలువ ఉంచే మాంసంపై ఈ కొలి అనే బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మహిళలు ఫ్రిజ్‌లో నుంచి మాంసాన్ని తమ చేతులతో పట్టుకొని బయటికి తీస్తారో.. ఆ బ్యాక్టీరియా వారి చేతులపై చేరుతుంది. ఆ తరువాత ఆ బ్యాక్టీరియా చేతుల నుంచి ముక్కు, ముక్కు నుంచి నోరు, నోటి ద్వారా పొట్టలోకి ప్రవేశిస్తుంది. అది కాస్త మూత్రనాళంలో చేరి.. యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది.

వారికే ఎక్కువ ప్రమాదం:
ఈ బ్యాక్టీరియా కారణంగా.. మోనోపాజ్ దశ చేరుకున్న మహిళల్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్యలు.. ఎక్కువగా వచ్చే అవకాశముంది. దీనికి కారణం.. మన దేశంలో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో.. మూత్రనాళాలకు తగిన రక్షణ దొరకదు. ఎప్పుడైతే ఈ కోలి బ్యాక్టీరియా.. మూత్ర నాళాల్లో ప్రవేశించడంతో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు ఇవే
ఎవరైతే యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన పడతారో.. వారిలో ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే.. మూత్రం విసర్జించేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే అధికంగా మంట ఉంటుంది. సాధారణంగా కాకుండా, పదే పడే మూత్ర విసర్జనకు వెళ్లడం కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు సంకేతంగా చెబుతూ ఉంటారు.
వీటితో పాటు.. మూత్రం రంగు మారడం, మూతం వేరే విధంగా వాసన రావడం.. మూత్రంలో రక్తం పడడం వంటివి కూడా దీనికి లక్షణాలే. నీరసంగా అనిపించడం, అలసటగా ఉండడం, డీహైడ్రేట్ అవ్వడం వంటి లక్షణాలు మీకు ఉన్నట్లు అనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అనేది చెక్ చేసుకొని, దానికి తగిన చికిత్స తీసుకుంటే ఉత్తమం. లేకపోతే దీర్ఘ కాలమైన సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈ కథానాంశంలోని సమాచారమంతా.. పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇందులోని అంశాలు పాటించే ముందు, తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమమైన నిర్ణయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











