Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Winter: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకుంటున్నారా? పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
చలి కాలం మధ్యలో మనం ఉన్నాం. ఓ వైపు వర్షం, మరోవైపు చలి తెగ వేసేస్తుంది. దీంతో చాలా మంది రూమ్ హీటర్లు వాడుతున్నారు. కొంత మంది ఒకటికి రెండు చలికోట్లు వేసుకొని తిరుగుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు ఈ చలి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ముఖంపైన కూడా దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఇలా పడుకోవడం అనేది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రక్త ప్రసరణ సరిగ్గా జరగదు
చలికాలంలో చాలా మంది చలి నుంచి తప్పించుకోవడానికి ముఖంపై నుంచి దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. పైగా మన నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సయిడ్ మళ్ళీ అక్కడే సర్క్యులేట్ అవుతుంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణను సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది
మనం తినే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వాలన్నా, జీర్ణక్రియ సరిగ్గా పని చేయాలన్నా కచ్చితంగా ఆక్సిజన్ అనేది అవసరం. సరైన ఆక్సిజన్ శరీరానికి అందకపోతే జీర్ణవ్యవస్థపై కచ్చితంగా భారం పడుతుంది. అయితే చలికాలంలో చలిస్తుందని మీరు దుప్పటి కప్పుకొని పడుకుంటే మీ జీన వ్యవస్థపై భారం పడుతుంది క్రమంగా మీ ఆహరం సరిగ్గా జీర్ణ కాకపోవడం జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతాయి.
ఊపిరితిత్తులపై ప్రభావం
మన శరీరానికి ఆక్సిజన్ చాలా ముఖ్యం. మనం ఊపిరితిత్తుల ద్వారా గాలి పీల్చుకొని వదిలేస్తుంటాం. అయితే ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకున్నప్పుడు మనకు, మన ఊపిరితిత్తులకు సరిపడా గాలి లేదా ఆక్సిజన్ అనేది అందదు. దీని కారణంగా ఊపిరితిత్తులు సంకోచించిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గుండెకు తగినంత ఆక్సిజన్ అందక గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చలికాలంలో ముఖం కప్పుకోకుండా పడుకోవడం చాలా మంచిది.
చర్మ సమస్యలు
చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దుప్పటిలోనే ఉండిపోయే చెడు గాలి చర్మాన్ని పాడు చేస్తుంది. చర్మం నలుపు రంగులోకి మారేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ఇది చర్మంపై దద్దుర్లు కూడా వచ్చేలా చేస్తుంది. అలాగే ఉబ్బసం, COPD, ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉండే వ్యక్తులు ఎప్పుడూ ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకోకూడదు. ఇలా పడుకోవడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా ఉన్న రోగులు కూడా దుప్పటి కప్పుకొని పడుకోవడం వలన సరైన గాలి ఆడక మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే దుప్పటి కప్పుకొని పడుకునే ముందు జాగ్రత్తలు తీసుకోండి.
గమనిక: ఈ కథనంలో మేము అందించిన వివరాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications