Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
Drinking Tea while smoking: సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా? ఇది తెలిస్తే జన్మలో ఆ తప్పు చేయరు!
ఆఫీసులో కాస్త బ్రేక్ దొరికితే చాలు చాలా మంది టీ తాగడానికి వెళ్తారు. కేవలం టీ మాత్రమే ఉంటే సరిపోదు.. టీతో పాటు సిగరెట్ కూడా వెలిగించాల్సిందే. ఇవి రెండు ఉంటేనే మనసుకు, శరీరానికి ఉత్తేజం వస్తుంది. అయితే టీతో పాటు సిగరెట్ కూడా తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధిత, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మలబద్దకం
టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది మలబద్దకం. టీలో సాధారణంగా కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పేగు సంకోచం అయ్యేలా ప్రేరేపిస్తుంది. అలాగే పేగుల పొరను పొడిగా మార్చేస్తుంది. దీంతో మలబద్దకం వంటి సమస్యలు వచ్చేస్తాయి.

అలాగే కెఫిన్ అనేది డీహైడ్రేషన్ సమస్యను ఎక్కువ చేస్తుంది. దీనివల్ల శరీరంలో నీరు లేకుండా అయిపోతుంది. దీంతో పేగులోని మలం బాగా గట్టిపడుతుంది. దీంతో అది పొట్టలో నుంచి బయటికి వెళ్లడం కష్టంగా మారుతుంది. దీని వల్ల మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే కొంతమంది టీలో పాలు కలుపుకొని తాగుతుంటారు. దీని వల్ల శరీరంలో చెడు కొవ్వు అనేది ఎక్కువగా పేరుకుపోతుంది. చెడు కొవ్వు ఎక్కువ అవ్వడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది.
జీర్ణాంతర సమస్యలు
సిగరెట్‌లో నికోటిన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది జీర్ణాశయాంతర వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. టీ తాగుతూ సిగరెట్ తాగడం వలన పేగు బాగా సంకోచానికి గురవుతుంది. క్రమంగా ఇలా తాగడం వల్ల పేగు అవసరానికి మించి సంకోచానికి గురవుతుంది. దీంతో జీర్ణాశయంలో నరాలు, కండరాలు బాగా దెబ్బతిని, అందులోని రవాణా బలహీన పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో జీర్ణాశయం క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే సిగరెట్‌లోని నికోటిన్ శరీరంతో పాటు పేగుల్లో కూడా రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. క్రమంగా జీర్ణక్రియ వ్యవస్థ భారీగా దెబ్బతింటుంది. పేగులు పచ్చిగా మారి, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మలబద్దకం వంటి సమస్యలు చిన్నవిగా అనిపించినప్పటికీ, క్రమంగా అవి చాలా ప్రమాదకరంగా మారుతాయి. వాటిని భరించడం మీ వల్ల ఏమాత్రం కాదు.
ఒకవేళ మీకు మలబద్దకం ఉంటే, అది కూడా టీ తాగడం, సిగరెట్ కాల్చడం వల్ల వచ్చినట్లు తేలితే, కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఈ రెండివల్లే మీరు మలబద్దకం బారిన పడ్డారేమో ఓసారి ఆలోచించుకోవాలి. ఇది నిజమని తేలితే వెంటనే ఈ అలవాట్లను మానేసి వైద్యులను సంప్రదించాలి. అప్పుడే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications