Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
తస్మాత్ జాగ్రత్త.. ACలో ఎక్కువ సేపు ఉంటున్నారా? ఈ ప్రాణానంత వ్యాధులు మీకు వచ్చినట్లే, ఇప్పుడే చెక్ చేసుకోండి!
ఈ మధ్య కాలంలో చాలా మంది ఏసీ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నారు. నిరంతరం ఏసీలోనే ఉండాలని అనుకుంటున్నారు. కానీ కొన్ని సర్వేల ప్రకారం ఏసీ గాలిని నిరంతరం పీల్చడం ద్వారా ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల తీవ్రమైన వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఏసీని వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ జాగ్రత్తలు ఏంటి? నిరంతరం ఏసీలో ఉండడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏసీ ఆన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొదటగా, ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని తలుపులు, కిటికీలు మరియు ఇతర ఓపెనింగ్స్ మొత్తం మూసివేయాలి. అలాగే, ఏసీ సరిగా పనిచేయడానికి, గది త్వరగా చల్లబడేందుకు ఫిల్టర్లను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఫిల్టర్లు బాగుంటే, ఏసీ సమర్థవంతంగా పని చేస్తుంది. గది మొత్తాన్ని చల్లగా ఉంచడానికి ఫ్యాన్‌ను లోస్పీడ్‌లో ఉంచడం కూడా ముఖ్యమే. గది చల్లబడట్లేదని భావిస్తే, వెంటనే ఫిల్టర్లను శుభ్రం చేయండి. అలాగే, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా గదిలోని ఇతర వైఫల్యాలు ఉన్నప్పుడు అవన్నీ ఆఫ్ చేయడం మంచిది.

ఏసీ వాడడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
ఆస్తమా: ఏసీ గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తమా బాధితులు ఏసీ గదిలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు.
డీహైడ్రేషన్: ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం డిహైడ్రేడ్కు గురవుతుంది. ఇది తీవ్రమైన డీహైడ్రేషన్‌కి దారితీస్తుంది. వేసవిలో ఈ సమస్యను నివారించడానికి జాగ్రత్త పడాలి. తరచుగా ఏసీలో ఉండకూడదు.
అలెర్జీ రినైటిస్: ఏసీలో ఎక్కువసేపు ఉండడం వల్ల అలెర్జీ రినైటిస్ సమస్యలు ఏర్పడవచ్చు. దీనిని తగ్గించడానికి, ఇతర సహజ మార్గాలు ఉపయోగించి గదిని చల్లబరచడం మంచిది.
ఇన్ఫెక్షన్ రిస్క్: ఏసీలో ఎక్కువసేపు ఉండడం వల్ల శ్వాసనాళాల ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
తలనొప్పి: ఏసీ ఎక్కువ ఉపయోగిస్తే, కొందరికి తలనొప్పి, వాంతులు లేదా తల తిరగడం వంటి లక్షణాలు కలగవచ్చు.
పొడి చర్మం: ఏసీ గాలిని ఎక్కువ సమయం పీల్చడం వలన చర్మం పొడిగా మారవచ్చు. ఈ సమస్యను నివారించడానికి, మీరు ఏసీకి బదులుగా పచ్చి మొక్కలు లేదా కర్టెన్లు ఉపయోగించి సహజ చల్లదనం పొందవచ్చు. అలాగే, ఏసీని ఒక నిర్దిష్ట సమయానికి ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి సమస్యలను ఎదుర్కోవకుండా ఉండేందుకు, ఏసీని జాగ్రత్తగా వాడటం, సహజ మార్గాలను అవలంబించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
