Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
ఒక వారం డే షిఫ్ట్,మరో వారం నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే ఏమైపోతారో!
నైట్ షిఫ్ట్ లో పని చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించిన లేటేస్ట్ వివరాలు తెలిస్తే నైట్ షిఫ్ట్ లలో పనిచేసే ఉద్యోగులు నోరెళ్లబెట్టి షాక్ అవ్వాల్సిందే. ఈ ఆధునిక ప్రపంచంలో నైట్ షిఫ్ట్ లు చాలా కామన్ గా మారిపోయాయి. నైట్ షిఫ్ట్ లలో పనిచేసే ఉద్యోగులకు కొన్ని కంపెనీలు, ఆఫీసులు రవాణా సదుపాయం కూడా కల్పిస్తుండటంతో నైట్ షిఫ్ట్ లలో పనిచేసే వాళ్ల సంఖ్య పెరుగుతుంది.
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి రోడ్డు మీద క్యాబ్ లు నడిపే డ్రైవర్లు వరకు చాలామంది నైట్ షిఫ్ట్ లలో పనిచేస్తున్నారు. అయితే ఒకవారం నైట్ షిఫ్ట్, మరో వారం డే షిఫ్ట్ ఇలా నాన్ స్టాండర్ట్ షిఫ్ట్ లలో పనిచేయడం ఆరోగ్యానికి చాలా డేంజర్. ఆరోగ్యంపై ఇది చాలా తీవ్ర ప్రభావం చూపుతుందని,అనేక ఆరోగ్య సమస్యలను ఏరికోరి తెచ్చుకున్నట్లునని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. మెటబాలిక్(జీవక్రియ) సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు, ఊబకాయం,పలు రకాల క్యాన్సర్స్ వ్యాధులు వచ్చే ప్రమాదముందన్నట్లు తెలిపింది.

జీవక్రియ లోపాలు(metabolic disorders)
కొద్ది రోజులు నైట్ షిఫ్ట్..కొద్ది రోజులు మార్నింగ్ షిఫ్ట్..ఇంకొన్ని రోజులు ఈవెనింగ్ షిఫ్ట్ ఇలా ఒక క్రమపద్దతి లేని షిఫ్ట్ లలో పనిచేయడం వల్ల ఫుడ్ ని ఎనర్జీగా మార్చే ప్రాసెస్ అయిన జీవక్రియపై భారీ ఎఫెక్ట్ పడుతుంది. మీ సిర్కాడియన్ రిథమ్‌ను మారరిపోతుంది, మీ హార్మోన్లు మారుతాయి. సిర్కాడియన్ రిథమ్స్ అనేది రోజులో శరీరం అనుభవించే శారీరక,మానసిక ప్రవర్తన మార్పుల సైకిల్ అని అర్థం. డైట్ లో, ఎక్సర్ సైజ్ లో అనారోగ్యకరమైన జీవనవిధానం ఉంటుంది.
నిద్ర సమస్య(sleep disorders)
మన శరీరం సూర్యుడు లేదా కాంతికి ప్రతిస్పందించేలా రూపొందించబడి ఉంటుంది. నాన్ స్డాండర్డ్ షిఫ్ట్ లలో పనిచేయడం వల్ల సిర్కాడియన్ రిథమ్ అని పిలువబడే 24 గంటల నిద్ర-మేల్కొనే వలయంలో ప్రాబ్లమ్ వస్తుంది. నిద్రలేమి, క్రమరహిత నిద్ర విధానాలు, గురక, పగటిపూట ఎక్కువగా నిద్రరావడం అన్నీ స్లీప్ డిసార్డర్స్ సంకేతాలు.
జీర్ణకోశ సమస్యలు
సిర్కాడియన్ రిథమ్ కి అంతరాయం కలిగితే అది ప్రేగులపై పెద్ద ప్రభావం చూపెడుతుంది. నైట్ షిఫ్టులు చేయడం వల్ల దీర్ఘకాలిక జీర్ణకోశ వ్యాధి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి పొత్తికడుపు వ్యాధి, డయోరియా,మలబద్ధకం, ప్రేగు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది
హృదయ సంబంధ వ్యాధులు
నైట్ షిఫ్ట్ లో అసలు పనిచేయని వాళ్లతో పోలిస్తే..ఐదు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు రొటేటింగ్ నైట్ షిఫ్ట్ లలో పనిచేసే మహిళలు హృదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం చాలా ఎక్కువ అని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ జరిపిన ఓ పరిశోధనలో తేలింది. రొటేషనల్ షిఫ్ట్ లు మీ హృదయ సంబంధ వ్యాధులపై ప్రభావం చూపుతాయని..హార్ట్ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది.
మీ సిర్కాడియన్ రిథమ్ యొక్క అసమతుల్యత మీ కణాల ఫంక్షన్ ని ప్రభావితం చేస్తుంది . సిర్కాడియన్ రిథమ్ కి అవాంతరం కలుగుతుంటే క్రమంగా అది క్యాన్సర్ కి దారి తీస్తుంది.
ఈ సమస్యను ఎదుర్కోవడం ఎలా
-కనీసం 7-9 గంటల పాలు అవాంతరం లేని నిద్ర ఉండేలా చూసుకోండి. దీంతో మా శరీరం రిపేర్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది.
-నిద్రపోయే రెండు గంటల ముందు కెఫిన్ ఉండే పానీయాలను తీసుకోవద్దు. అలాగే స్మోకింగ్, మందు తాగడం మానేయండి
- రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి. హై ప్రొటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్స్, తక్కువ షుగర్ తీసుకోండి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నిలకడగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు.
-మానసిక ఆనందపై ఫోకస్ పెట్టండి. వారంలో ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వారితో సరదాగా గడపండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications