Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ పాదాలే చెప్పేస్తాయి.. మీకు షుగర్ ఉందో లేదో.. ఈ లక్షణాలను గమనించండి
షుగర్ వ్యాధి పేరు వింటే చాలామందికి గుండెల్లో టెన్షన్ పుడుతుంటది. దీనికి కారణం ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందు ఇప్పటివరకు లేకపోవడమే. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే దాన్ని నియంత్రించగలం తప్ప పూర్తిగా నయం చేయలేం. మనదేశంలో కోట్ల మంది ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.
షుగర్ వ్యాధి అనేది కేవలం రక్తంలో షుగర్ లెవల్స్ కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు ఇది శరీరంలోని అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే..షుగర్ వ్యాధి తాలూకు మొదటి హెచ్చరికలు మన పాదాల నుండే మొదలవుతాయి. గుండె నుండి పాదాలకు రక్తం చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పెరిగిన షుగర్ లెవెల్స్ వల్ల రక్తనాళాలు, నరాలు దెబ్బతిన్న లక్షణాలు మొదట అక్కడే కనిపిస్తాయి.

మీ పాదాలు మీకు ఇచ్చే ఈ క్రింది సంకేతాలను గమనించండి
కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు
కూర్చున్నప్పుడు కాళ్లు తిమ్మిరి ఎక్కడం వేరు..కానీ ఏ కారణం లేకుండా తరచూ కాళ్ళలో జలదరింపుగా అనిపిస్తోందా? అయితే ఇది డయాబెటిక్ న్యూరోపతి (నరాల బలహీనత)కి సంకేతం. రక్తంలో షుగర్ పెరగడం వల్ల నరాలు దెబ్బతిని, స్పర్శజ్ఞానం కోల్పోవడం జరుగుతుంది. ఇది మొదట్లో చిన్నగా అనిపించినా, కాలక్రమేణా తీవ్రమవుతుంది.
పాదాలలో విపరీతమైన మంటలు
రోజంతా పని చేయడం వల్ల అలసిపోయామని అనుకుంటారు చాలామంది. కానీ రాత్రి పూట ముఖ్యంగా పడుకునే సమయంలో పాదాల్లో భరించలేని మంటలు లేదా సూదులతో గుచ్చినట్లు అనిపిస్తే అది డయాబెటిస్ ప్రథమ లక్షణం కావచ్చు. ఈ నొప్పి నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది.
గాయాలు త్వరగా మానకపోవడం
ఇది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. డయాబెటిస్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి, హీలింగ్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. పాదాలపై చిన్న గీతలు, కోతలు లేదా పుండ్లు ఏర్పడినా అవి వారాల తరబడి మానవు. వీటిని వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే ఇన్ఫెక్షన్లుగా మారి తీవ్ర రూపం దాల్చుతాయి.
పాదాలు పొడిబారడం - పగుళ్లు
వాతావరణం చల్లగా లేకపోయినా మీ పాదాలు పొడిబారిపోతున్నాయా? డయాబెటిస్ వల్ల చర్మంలో తేమ తగ్గిపోయి, పాదాల అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది.
చర్మం రంగులో మార్పు
మీ పాదాల చర్మం రంగు పాలిపోయినట్లుగా లేదా ఎర్రగా మారుతోందా? అలాగే గోర్లు పసుపు రంగులోకి మారి, మందంగా తయారవుతున్నాయా? రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఇలా జరుగుతుంది. ఇది స్పష్టమైన హెచ్చరిక.
వెంటాడుతున్న ఇన్ఫెక్షన్లు
డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల కాలి వేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం, అవి మందులు వాడినా మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం గమనించదగ్గ విషయం.
నడవడానికి ఇబ్బంది
మీ కాళ్ళలో బలం తగ్గినట్లు అనిపిస్తోందా? నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం లేదా కాళ్ళు భారంగా అనిపించడం జరుగుతోందా? ఇది నరాలు, కండరాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతం. కండరాల బలం తగ్గడం వల్ల నడకలో మార్పు వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications