Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.!
అతివలకు ఒత్తయిన జుట్టుతో పాటు కనుబొమ్మలు మరింత అందాన్ని ఇస్తాయి. అయితే కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వీటిని దట్టంగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఐ బ్రో పెన్సిల్‌ను అప్లై చేయడం లేదంటే ఇతర సౌందర్య చిట్కాలను పాటిస్తుంటారు. కానీ ఎలాంటి రసాయన ఉత్పత్తులను వాడకుండా సహజంగా మీ కనుబొమ్మలను దట్టంగా మార్చుకోవడానికి కొన్ని అద్భుతమైన సలహాలను చర్మ వైద్య నిపుణులు అందిస్తున్నారు. అవేంటో చూద్దాం..

ఐబ్రోస్‌కి ఆర్గాన్ నూనె
మీ కనుబొమ్మలను దట్టంగా, అందంగా మార్చుకోవడానికి ఆర్గాన్ నూనె సహజసిద్ధంగా పనిచేయడంతో పాటు సత్ఫలితాలను అందిస్తుంది. ఆర్గాన్ నూనెలోని విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కనుబొమ్మలకు అప్లై చేయడం ద్వారా వాటిని దట్టంగా చేసి సహజ మెరుపును కాపాడుతుంది. ప్రతి రోజూ ఆర్గాన్ నూనెను అప్లై చేయడం ద్వారా త్వరలోనే చిక్కటి ఐ బ్రోస్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..
ముందుగా ముఖాన్ని, కనుబొమ్మలను నీటితో కడుక్కోవాలి. తర్వాత రెండు లేదా మూడు చుక్కల ఆర్గాన్ నూనెను కనుబొమ్మలపై రాస్తూ మసాజ్ చేయండి. ప్రతి రోజూ రాత్రి నిద్ర పోయే ముందు ఐ బ్రోస్‌కు ఈ నూనెతో మసాజ్ చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. పడుకునే ముందు ఇలా చేయడం ద్వారా కనుబొమ్మలపై దుమ్ము పడకుండా, ఒత్తిడి లేకుండా ఉంటుంది. నిద్రలోనే విశ్రాంతి దొరికి ఆర్గాన్ నూనె బాగా పనిచేస్తుంది.

ఒకవేళ మీ కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటే ఆర్గాన్ నూనెలో కొద్దిగా ఆముదం నూనె కలిపి మసాజ్ చేయండి. ఒక టీ స్పూన్ చొప్పున రెండూ సమపాళ్లలో కలిపి బాగా కలిపి.. వారానికి నాలుగు నుంచి ఐదు సార్లు అప్లై చేయడం ద్వారా త్వరగా ప్రయోజనం చేకూరుతుంది. ఒకవేళ మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే ఆముదం నూనెకి బదులుగా అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. ఐదు చుక్కల చొప్పున సమపాళ్లలో కలిపి మసాజ్ చేయాలి. ఒక 30 నిమిషాలు ఆగి ముఖం కడుక్కోవాలి.
ఐ బ్రో పెన్సిల్స్ లాంటి ఎలాంటి రసాయన ఉత్పత్తులు వాడకుండా మీ కనుబొమ్మలను సహజంగానే ఆరోగ్యకరంగా దట్టంగా చేసుకోవచ్చు. ఆర్గాన్ నూనె ద్వారా అందులోని విటమిన్లు చర్మాన్ని, కనుబొమ్మలను మృదువుగా చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
