Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
పిల్లలు పుట్టక ఇబ్బందిపడేవాళ్లకి భారీ శుభవార్త..ఇక ఈజీగా కనేయొచ్చు
ప్రస్తుతం మనదేశంలో చాలామంది దంపతులు పిల్లలు పుట్టక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కావాలనేది ప్రతి జంట జీవితంలో ఒక మధురమైన కల. కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పురుషులు వంధ్యత్వ సమస్యతో(infertility) బాధపడుతూ, ఈ ఆనందానికి దూరమవుతున్నారు. కొందరిలో వీర్యకణాలు అసలు ఉత్పత్తి కాకపోవడం పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి వారికి ఇప్పుడు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రయోగశాలలో మూలకణాల నుండి వీర్యకణాలను విజయవంతంగా సృష్టించి వైద్య చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు సైంటిస్టులు. దీంతో వంధ్యత్వ సమస్యలు ఎదుర్కొనే పురుషులు కూడా ఇకపై తండ్రులు కావచ్చు.
ల్యాబ్ లో అద్భుతం
చైనా పరిశోధకులు మూల కణాలు(Stem Cells)ను ఉపయోగించి ప్రారంభ దశలో ఉన్న శుక్రకణాలను విజయవంతంగా సృష్టించారు. మూల కణాలు అనేవి మన శరీరంలోని ప్రత్యేకమైన కణాలు. ఇవి ఎలాంటి కణంగానైనా రూపాంతరం చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన లక్షణాన్నే ఆధారం చేసుకుని ఎలుకల నుండి సేకరించిన మూల కణాలను ప్రయోగశాలలో శుక్రకణాల మాదిరి డెవలప్ చేశారు. ఆ తర్వాత ఈ కృత్రిమ శుక్రకణాలతో ఎలుకల అండాలను ఫలదీకరణం చేయగా ఆరోగ్యకరమైన ఎలుక పిల్లలు జన్మించడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో మానవులపై కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు మార్గం సుగమమైంది.

అత్యంత కీలకమైనది
ఈ పరిశోధనను ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైనదిగా వైద్య నిపుణులు పరిగణిస్తున్నారు. ఒకవేళ ఇది మానవులకు కూడా వర్తింపజేయగలిగితే అది వైద్య శాస్త్ర చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం అవుతుంది. ముఖ్యంగా వ్యంధత్వ సమస్యతో బాధపడుతున్న పురుషులకు ఇది ఒక వరం లాంటిది. పిల్లలు పుట్టక ఇబ్బంది పడేవాళ్లకి ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా తండ్రి అయ్యే భాగ్యం కలుగుతుంది. తమ సొంత జన్యుపరమైన బిడ్డను కనాలని కలలు కనే దంపతులకు ఇది నిజంగా ఓ శుభవార్త.
మానవులపై ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం ఎలుకలపై సాధించిన విజయాన్ని మానవ మూల కణాలపై కూడా పునరావృతం చేయడానికి సైంటిస్టులు కృషి చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే డాక్టర్లు ఒక పురుషుడి శరీరం సహజంగా శుక్రకణాలను ఉత్పత్తి చేయలేకపోయిన, అతని చర్మం లేదా ఇతర శరీర భాగాల నుండి మూల కణాలను సేకరించి,వాటి నుండి ప్రయోగశాలలో శుక్రకణాలను తయారు చేయగలరు. ఆ శుక్రకణాలను ఉపయోగించి అతని భాగస్వామి అండాలను ఫలదీకరణం చేసి వారికి సొంత బిడ్డను ప్రసాదించవచ్చు. ఇది వంధ్యత్వ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పుకు దారితీస్తుంది.
సవాళ్లు ఇవే
అయితే ఈ ఆవిష్కరణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఎలుకలపై విజయవంతమైనంత మాత్రాన మానవులపై కూడా అంతే సులభంగా ఫలితాలు వస్తాయని చెప్పలేమని.. మానవులపై ప్రయోగించే ముందు, భద్రత, సమర్థత, నైతిక అంశాలు వంటి అనేక విషయాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ వలన దీర్ఘకాలంలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో కూడా పూర్తిగా అంచనా వేయాలన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications