Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Summer Diet Mistakes: సమ్మర్‌లో హుషారుగా ఉండాలంటే ఈ డైట్ మిస్టేక్స్ అస్సలే చేయొద్దు
బయట ఎండలు మండిపోతున్నాయి. అలా కొద్దిసేపు బయటకు వెళ్లొస్తే ఎండకు నీరసించి పోతుంటారు. ఎనర్జీ అంతా పోయి కూలబడిపోతుంటారు. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు సతమతం చేస్తుంటాయి.
అన్నింటికంటే ముఖ్యంగా ఎండాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రయత్నించాలి. ఎక్కువగా నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. అలాగే ఎండ వేడిమికి మృదవైన కాటన్ దుస్తులు ధరించడం మంచిది. అలాగే మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లడాన్ని తగ్గించాలి. బయటకు వెళ్తే గొడుగు, నెత్తికి టోపీ, కర్చీఫ్ లాంటివి పెట్టుకోవాలి. ఎండకు బయటకు వెళ్లే వారు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

వేసవి కాలంలో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఫ్రూట్ జ్యూసుల వంటి వాటితో ప్రమాదం లేకపోయినా, కూల్ డ్రింకులు, కార్బొనేటెడ్ వాటర్ లాంటి వాటితో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ వేసవి కాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. వేసవికాలంలో ఎలాంటి డైట్ పాటించాలి, ఎలాంటి డైట్ మిస్టేక్స్ ను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తగినంత నీరు తాగకపోవడం:
కాలానితో సంబంధం లేకుండా తగినంత నీరు తాగడం చాలా అవసరం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎండాకాలంలో చెమట రూపంలోనో ఎక్కువ నీరు బయటకు పోతుంది. అందువల్లే మీరు నీరు ఎక్కువగా తాగాలి. కేవలం ఎండాకాలమనే మీదు మిగతా కాలల్లో కూడా నీరు ఎక్కువగా తాగాలి. అలాగే పండ్ల రసాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
2. ఉప్పగా ఉండే స్నాక్స్ తీసుకోవడం:
చాలా మందికి స్నాక్స్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం కాగానే ఏ పకోడీలో, మిర్చీ బజ్జీలో, సమోసాలో తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ వేసవి కాలం స్నాక్స్ తీసుకోవడం అస్సలే మంచిది కాదు. ముఖ్యంగా ఉప్పగా ఉండే పదార్థాలకు మీరు ఇప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్యాక్స్ చేసిన చిప్స్, కుక్కీలు వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్నప్పుడు మీ శరీరానికి మరింత నీరు కావాల్సి ఉంటుంది.
3. అధిక కేలరీల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం:
అధిక కేలరీలు ఉన్న పానీయాలలను ఎక్కువగా తాగకండి. నిమ్మకాయ జ్యూస్ లేది తాజా నిమ్మరసం వంటివి తాగడం చాలా మంచిది. ముఖ్యందా శర్బత్ వేసవిలో చాలా ఉపయోగపడుతుంది.
4. క్రాష్ డైట్ తీసుకోవడం:
వేసవిలో క్రాష్ డైట్ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఖాళీ కడుపుతో ఉంటే ఎండాకాలంలో అనేక సమస్యలు వస్తాయి. వేడి వల్ల మనుషులు త్వరగా నీరసపడిపోతారు. ఇంకా మొత్తానికి తినకుండా ఉంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
5. సీజనల్ ఫ్రూట్స్ ను తినకుండా ఉండకూడదు:
ప్రతీ కాలంలో ఏదో ఒక పండు వస్తుంటుంది. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే వేసవి కాలంలో పుచ్చకాయతో పాటు మామిడి పండ్లు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. వీటిని తినకుండా మాత్రం ఉండకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications