Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
ఎర్రటి ఎండలో చల్లటి బీర్.. స్టఫ్‌గా ఇవి అస్సలే తినొద్దు
ఎండలు మండిపోతున్నాయి. ఎర్రటి ఎండలో చల్లటి బీర్ తాగాలని కుర్రకారుకు తెగ సరదాగా ఉంటుంది. విస్కీ, రమ్, వైన్, వొడ్కాలతో పోలిస్తే బీర్లకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇందులో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. వేసవికాలంలో చిల్డ్ బీర్ తాగాలని చాలా మందికి నాలుక లాగేస్తుంటుంది. చాలా మంది బీర్ తాగేటప్పుడు మల్టిపుల్ స్నాక్స్‌ను సైడ్ డిష్(స్టఫ్) గా తినడానికి ఇష్టపడతారు.
వేసవికాలంలో ఆల్కహాల్ తీసుకుంటే సాధారణం కంటే వేగంగా శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అందుకే మద్యం సేవించే వారు ఎక్కువగా నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. అలాగే బీర్ తాగేటప్పుడు తీసుకునే ఆహారం ఆరోగ్యాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. డీహైడ్రేషన్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. బీర్ తాగేటప్పుడు, తాగిన తర్వాత ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా ఆహారాలు:
బీర్ తో పాటు కారం కారంగా ఉండే ఆహార పదార్థాలు తింటే ఆ మజానే వేరు అనుకుంటారు చాలా మంది. అయితే మసాలా దట్టించిన, కారంగా ఉండే ఆహారాలు బీర్ తాగుతున్నప్పుడు తీసుకుంటే శరీరంపై ప్రభావం పడుతుంది. స్పైసీ ఆహారాల్లో క్యాపైసిన్ ఉంటుంది. ఇది కడుపును చికాకు పెడుతుంది. ఇది పడకపోతే వాంతులు కూడా అవ్వొచ్చు.
బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్:
బీర్ తాగేటప్పుడు బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వాటిని అస్సలే తినొద్దు. సాల్టీ స్నాక్స్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తాగినప్పుడు ఈ ఆహారాలు జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. సాల్టీ ఫుడ్స్ డీహైడ్రేషన్ ను మరింత పెంచుతాయి. దీని వల్ల మరింత ఎక్కువగా తాగుతుంటారు. ఎక్కువగా తాగితే ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఒకవేళ తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కు గురవుతారు. తలనొప్పి లాంటివి వేధిస్తాయి.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ బీర్ తాగేటప్పుడు వీటిని తీసుకుంటే సమస్యలు తప్పవు. చాక్లెట్లలో కెఫిన్, కొవ్వు, కోకో ఉంటాయి. బీరుతో కలిపి వీటిని తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు వస్తాయి.
గుడ్డు, జున్ను:
బీర్‌లో ఈస్ట్ ఉంటుంది. ఇది కిణ్వ ప్రక్రియను జరుపుతుంది. ఇది గుడ్లకు ప్రత్యేకమైన ఈస్ట్ రుచిని ఇస్తుంది. అయితే కిణ్వ ప్రక్రియ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంది.
కాబట్టి బీర్ తాగేటప్పుడు గుడ్లు, జున్ను తీసుకోకపోవడం మంచిది.
డ్రై ఫ్రూట్స్:
బీర్ కు స్టఫ్‌గా చాలా మంది సాల్టెడ్ పీనట్స్, డ్రై ఫ్రూట్స్, ఇతర ఉప్పు ఎక్కువుండే ఆహార పదార్థాలు తింటుంటారు. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. ఇది ఎడెమా, అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
సిట్రస్ పండ్లు:
బీర్ తాగేటప్పుడు సిట్రస్ పండ్లు, వెనిగర్ ఆధారిత ఆహారాలు తీసుకోవద్దు. వీటిలోని యాసిడ్, బీరులోని యాసిడ్ చేదును పెంచుతాయి. ఇది జీర్ణక్రియ సమస్యలను తెచ్చిపెడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











