Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బీపీ తగ్గాలంటే ఈ ఫుడ్స్ అస్సలే తినొద్దు, అవేంటో తెలుసుకోండి
హైబీపీ చాలా ప్రమాదం. రక్త సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల గుండె సంబంధిత సమస్యలు రావొచ్చు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ సోడియం ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రక్త సరఫరా హెచ్చుతగ్గులకు గురవుతుంది. కొంత మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సోడియం ఫుడ్స్.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలకు దారి తీస్తుంది.
అధిక రక్తపోటు ఉన్న వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినొద్దు. ఎందుకంటే సోడియం అధికంగా తీసుకోవడం వల్ల బీపీ మరింతగా పెరుగుతుంది. అధిక రక్తపోటు పెరుగుదల ఫలితంగా మనం దూరంగా ఉండవలసిన కొన్ని సోడియం అధికంగా ఉండే ఆహారాలు ఉన్నాయి.

ఆకు కూరలు:
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. కానీ అధిక సోడియం ఉండే ఫుడ్స వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బచ్చలికూర, క్యారెట్లు, దుంపలు కొన్నింటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్త పోటును పెంచుతాయి. ఒకవేళ అధిక రక్తపోటు ఉంటే వీటిని తినకపోవడం ఉత్తమం.
చీజ్:
చీజ్ చాలా మందికి ఇష్టమైనద ఆహార పదార్థం. కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇందులో ఉప్పు, సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. అంటే చీజ్ ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తపోటు సమస్యలు ఉంటే.. చీజ్ తినకపోవడం మంచిది.
ఊరగాయలు, ప్రాసెస్డ్ ఫుడ్స్:
ఊరగాయలు తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రుచిగా ఉండే ఊరగాయల వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఊరగాయల్లో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల పలు సమస్యలు రావొచ్చు. సాసేజ్ లు, ఇతర ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది.
మసాలాలు:
మసాలాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. సోయా సాస్, కెచప్, బార్బెక్యూ సాస్, సలాడ్ డ్రెస్సింగ్ వంటి వాటిలో సోడియం అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న వారు వీటిని తినకపోవడం మంచిది.
ప్యాకేజ్డ్ ఫుడ్స్:
చిప్స్, సేవ్‌ముర్‌మురా సహా ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. సోడియం బీపీని పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications