Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎండాకాలంలో తినకూడని కూరగాయలు ఇవే!..తింటే మీ ఆరోగ్యం అంతే!
ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచే సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంత వేడి ఈసారి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు వింటే భయమేస్తోంది. సాధారణంగా చలికాలం వచ్చిందంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయో..వేసవిలోనూ కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎండలు మొదలయ్యాయి అంటే మనం తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వేసవిలో కొన్ని రకాల కూరగాయలు మన ఆరోగ్యానికి అంత మంచి చేయవు. కొన్ని కూరగాయలు మన శరీర ఉష్ణోగ్రతను పెంచేస్తాయి. మరికొన్ని అయితే ఇతర ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. వేసవిలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

క్యాబేజీ ఫ్యామిలీ
క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ..ఇవి పోషకాలు కలిగిన కూరగాయలే కానీ వేసవిలో వీటిని తింటే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు. అంతేకాదు జీర్ణవ్యవస్థలో కూడా కాస్త అసౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ తినాలనుకుంటే వీటిని బాగా ఉడికించి తక్కువ మోతాదులో తీసుకోండి.
కారం వద్దు
వేసవిలో కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తగ్గించాలి. పచ్చిమిరపకాయలు, ఎర్ర మిరపకాయలు వీలైనంత తక్కువగా వాడాలి. వాటి బదులు మిరియాల పొడిని వాడటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
వేరు కూరగాయలకు దూరంగా
క్యారెట్, బీట్‌రూట్, బంగాళాదుంప..ఇవి మన రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉండే కూరగాయలు. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. అయితే ఎండాకాలంలో వీటిని ఎక్కువగా తింటే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇవి బరువుగా అనిపించడమే కాకుండా శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. బంగాళాదుంపలు లాంటి వేరు కూరగాయలు అధిక ఉష్ణ వాహకతను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట. ఇది మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి వేసవిలో వీటి మోతాదు తగ్గించడం మంచిది.
వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా
ఏదైనా కూర రుచిగా ఉండాలంటే ఉల్లిపాయ,వెల్లుల్లి తప్పనిసరి. ఈ రెండు లేకుండా వంట చేయడం చాలా కష్టం. కానీ వీటిలో శరీర వేడిని పెంచే గుణాలు ఉన్నాయి. వీటిని పూర్తిగా మానేయడం కష్టమే కానీ వేసవిలో వీటి వాడకాన్ని తగ్గిస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొంచెం తగ్గించి వాడటానికి ప్రయత్నించండి.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు చాలా రుచికరమైన ఆహారం. ఆరోగ్యానికి కూడా మంచిదే. కానీ వీటిని తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. కాబట్టి వేసవిలో వీటిని కూడా మితంగానే తీసుకోవాలి.
పాలకూర
పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో దీన్ని ఎక్కువగా తింటే శరీరం కాల్షియంను గ్రహించే శక్తి తగ్గుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి పాలకూరను కూడా మితంగా తీసుకోవడమే ఉత్తమం.
మిరపకాయ
వేసవి నెలల్లో ఇవి జీర్ణం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటాయి. కాబట్టి వేసవిలో వీటిని తక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. రుచి కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూడటం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications