Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
దగ్గు కారణంగా రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్!
మన వంటగదిలో ఉండే ముఖ్యమైన పదార్థాలలో ఏలకులు ఒకటి. ఏలకులు దాని వాసనకు ప్రసిద్ధి. నల్ల ఏలకులలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీనిని ముఖ్యంగా బిర్యానీ, అనేక రకాల స్వీట్లు, ఇతర వంటకాల తయారీ ఉపయోగిస్తారు. ఇది ఆహారానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అయితే నల్ల ఏలకులు గురించి మీకు ఏం తెలుసు?పెద్ద ఏలకులకు మరో పేరు 'నల్ల ఏలకులు'.
మనదేశంలో వందల ఏళ్లుగా నల్ల ఏలకులు ఉపయోగించబడుతున్నాయి. వీటిని భారతదేశంలోనే కాకుండా ఇతర ఆసియా దేశాలలో కూడా వంటలలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఏలకులు అద్భుతాలనే చేస్తాయి. చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సర్వసాధారణం. ప్రస్తుతం ఎక్కడచూసినా అందరూ జలుబు,దగ్గు సమస్యతో బాధపడున్నారు. ఈ సమయంలో నల్లఏలకులను హోం రెమెడీగా వాటి జలుబు,దగ్గు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

నల్ల ఏలకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఇది గొంతు వాపును తగ్గించడం, ఇన్ఫెక్షన్ తో పోరాడడం ద్వారా తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలకు చెక్ పెట్టడానికి నల్ల ఏలకులు ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూడండి.
తేనెతో నల్ల ఏలకులు
పెద్ద ఏలకుల గింజలను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక చెంచా తేనెతో కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పొడి దగ్గు, కఫం నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె గొంతును ద్రవపదార్థం చేస్తుంది, ఏలకులలోని యాంటీ సెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సహాయపడతాయి
రాత్రిపూట పాలతో నల్ల ఏలకులు
వేడి పాలలో కొన్ని పెద్ద ఏలకుల గింజలను ఉడకబెట్టండి. రాత్రిపూట దగ్గు నుండి ఉపశమనం పొందడానికి మంచి నిద్ర పొందడానికి గోరువెచ్చని వడగట్టిన ఏలకులు కలిపిన పాలు తాగాలి. పాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి, ఏలకులు దగ్గును ఉపశమనం చేస్తాయి.
పెద్ద ఏలకుల టీ
పెద్ద యాలకుల గింజలను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని వేడినీటిలో వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి. తర్వాత ఒక కప్పులో వడకట్టాలి. ఇప్పుడు దానికి తేనె కలిపి గోరువెచ్చగా తాగాలి. ఈ టీ గొంతు నొప్పి, పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
నూనెగా
యాలకుల గింజలలో ఉండే సహజ నూనె నోరు, గొంతును శుభ్రంగా ఉంచుతుంది. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఏలకుల నూనెతో పుక్కిలించండి. ఇందులోని యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు గొంతు మంటను తగ్గించి, దగ్గును ఉపశమనం చేస్తాయి. కావాలంటే కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే నల్ల యాలకుల గింజలను నిదానంగా నమిలితే నోటికి మంచి రుచి వస్తుంది. అలాగే గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications