Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
నోటి నుంచి దుర్వాసన వస్తుందా? ఏ తీవ్ర వ్యాధులకు ఇది సంకేతమో తెలుసా..
చాలామంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. నోటిలో విడుదలయ్యే రసాయనాలు, ఇతర వాయువుల వల్ల దుర్వాసన వస్తుందని మనకు తెలిసిన విషయం. నోటి దుర్వాసకి తినే ఆహారానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకపోతే తిన్న పదార్థం పంటి లోపల చిక్కుకొని, దాంట్లో బాక్టీరియా పెరిగి దుర్వాసనకి కారణమవుతుంది. ఒక్కోసారి మీ నోరు కుళ్లిన కోడిగుడ్ల కంపు కొడితే, మరోసారి చెడిపోయిన క్యాబేజీ వాసన వస్తుంది. అయితే నోటి దుర్వాసన రావడానికి ఈ రెండు మాత్రమే కారణం కాదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. పళ్ళు తోముకోకపోవడం మాత్రమే నోటి దుర్వాసనకు కారణం అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని వ్యాధులకు ఇది సంకేతం కూడా అని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఎంత శుభ్రంగా ఉన్నా, మీ నోటి నుండి దుర్వాసన వస్తుందా? దీర్ఘకాలిక దుర్వాసన నోటి సమస్యల వల్ల మాత్రమే కాదు, వివిధ వ్యాధుల ప్రారంభ సంకేతం కూడా కావచ్చు. దుర్వాసనకు కారణమేమిటో ఇక్కడ చూడండి.

పీరియాడోంటల్ వ్యాధి (చిగుళ్ల వ్యాధి)
చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు, బ్యాక్టీరియా పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసనకు కారణమవుతుంది. ఇది దంతాలు ఊడిపోడానికి కూడా దారితీస్తుంది.
లివర్,కిడ్నీ సమస్యలు
కాలేయ సిర్రోసిస్ లేదా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నప్పుడు శరీరం నుండి విషపదార్థాలు సరిగా బయటకు వెళ్లలేవు. ఈ విషపదార్థాలు నోటి దుర్వాసనకు దారితీస్తాయి.
సైనస్ ఇన్ఫెక్షన్ లేదా శ్వాసకోశ వ్యాధి
సైనస్ లలో చీము లేదా ఇన్ఫెక్షన్ చేరినప్పుడు ముక్కు నుండి గొంతులోకి కారడం ద్వారా దుర్వాసన వస్తుంది. ఇది శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కూడా సంకేతం కావచ్చు.
ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్
కడుపులో ఉత్పత్తి అయ్యే అధిక ఆమ్లం లేదా ఆహార పైపు ద్వారా ఆమ్లం పైకి రావడం (గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్) నోటి వరకు చేరి దుర్వాసనను కలిగిస్తుంది.
టాన్సిల్ రాళ్ళు
టాన్సిల్స్ లో తెల్లటి, రాయి లాంటి వస్తువులు పేరుకుపోయి దుర్వాసనను సృష్టిస్తాయి.
డయాబెటిస్
నియంత్రణలో లేని డయాబెటిస్ ఉన్నవారి నోటి నుండి తీపి, అసిటోన్ లాంటి విలక్షణమైన వాసన వస్తుంది. ఇది అత్యవసరంగా డాక్టర్ ని సంప్రదించాల్సిన సంకేతం.
ఆహారపు అలవాట్లు
ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చి మాంసం లేదా అధిక ప్రోటీన్ వంటి ఆహారాలు తినడం వల్ల కూడా దుర్వాసన వస్తుంది.
నోరు పొడిబారడం
లాలాజలం నోటిలోని బ్యాక్టీరియాను కడిగివేయడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు త్రాగడం లేదా ఎక్కువసేపు తాగకపోవడం వల్ల మీ నోరు ఎండిపోయి దుర్వాసన వస్తుంది.
అపరిశుభ్రమైన నోరు
క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం లేదా నాలుకను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన పెరుగుతుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు నోటిలో బ్యాక్టీరియాను పెంచుతాయి, ఇది దుర్వాసనకు కారణమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
