Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Hot water: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? 99శాతం మందికి తెలియని అతిపెద్ద రహస్యం..శృంగార జీవితం..
చాలామందికి ప్రతిరోజూ వేడి నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో పొగలు కక్కే నీళ్లతో స్నానం చేస్తుంటారు. మరికొందరు గడ్డకట్టే చలిలో అయినా చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అయితే వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల సంతాన సమస్యలు వచ్చే అవకశాముందట. మహిళలకు పిల్లలు పుట్టకపోవడానికి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ సంబంధ సమస్యలు వంటి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ పురుషులకు మాత్రం వీర్యకణాల నాణ్యత,పరిమాణం అనేవి మాత్రమే ప్రధాన సమస్యలుగా ఉంటాయి. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల పురుషులకు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తగిన ఉష్ణోగ్రతలో స్నానం శరీరానికి శ్రేయస్కరం. కానీ ఎక్కువ వేడి నీటితో స్నానం ఆరోగ్యానికి ప్రతికూలంగా మారవచ్చు. చర్మ సమస్యలు, రక్తపోటు సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను ఇది ప్రేరేపించవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు శుక్ర కణాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వృషణాలు శరీరంలోని మిగతా భాగాల కంటే కొద్దిగా చల్లగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలు వృషణాలను ప్రభావితం చేయడం వల్ల శుక్ర కణాల ఉత్పత్తి, నాణ్యత తగ్గే అవకాశం ఉంటుది. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయవచ్చు. హార్మోన్ల అసమతుల్యత సంతానోత్పత్తి సమస్యలకు దారితీయవచ్చు.

అధిక ఉష్ణోగ్రతలు రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే అవకాశం ఉంది. బలహీనమైన రోగ నిరోధక శక్తి సంతానోత్పత్తికి అవసరమైన అనేక శరీర ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రభావాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి, అనేక ఇతర కారకాలపై ఆధారపడి ఉంటాయి.
నిపుణుల సూచనల గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. అధికంగా వేడి నీరు వాడకూడదు. వేడి నీటితో స్నానం చేసేటప్పుడు వృషణాలపై నేరుగా వేడి నీరు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వృషణాలను అధిక ఉష్ణోగ్రతల నుండి రక్షించడం చాలా ముఖ్యం. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల సంతానోత్పత్తిపై నేరుగా ప్రభావం పడుతుందనే శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే అధిక ఉష్ణోగ్రతలు శరీరానికి కొన్ని ప్రభావాలను చూపుతాయి. అందుకే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications