Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
వంటకాల్లో ప్రాణమైన కరివేపాకు కేవలం సువాసనకే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఒక దివ్యౌషధం. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కొలెస్ట్రాల్ ను నియంత్రించి, జుట్టు, చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. 100 గ్రాముల కరివేపాకులో ఏకంగా 830 మి.గ్రా కాల్షియం దాగి ఉంటుందంట.
కీళ్లు, ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే కరివేపాకును ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అంతేకాదు ఇందులో ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి. అయితే కరివేపాకును ఒంటరిగా కాకుండా ఐదు ఆహారాలతో కలిపి తీసుకుంటే.. మీ శరీరానికి రెట్టింపు కాల్షియం అందుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ అద్భుతమైన కాంబినేషన్స్ ఏంటో ఇక్కడ చూడండి.

నువ్వులు - కరివేపాకు
నువ్వుల్లో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ. కేవలం ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్లో 88 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. కరివేపాకు, నువ్వులు కలిపి దోరగా వేయించి 'కారంపొడి' లాగా చేసుకోండి. దీనిని వేడి వేడి అన్నం, ఇడ్లీ లేదా దోసెల్లో కలుపుకుని తింటే అద్భుతమైన రుచితో పాటు బోలెడంత కాల్షియం మీ సొంతం.
రాగులు - కరివేపాకు
తృణధాన్యాలలో రాగులు కాల్షియం గని లాంటివి. 100 గ్రాముల రాగులలో ఏకంగా 344 మి.గ్రా కాల్షియం ఉంటుంది. రాగి పిండిలో సన్నగా తరిగిన కరివేపాకు వేసి రాగి రోటీ, దోసె లేదా జావ చేసుకుని తాగితే శరీరానికి కావాల్సిన కాల్షియం ఇట్టే అందుతుంది. ఎముకల బలానికి ఇదొక బెస్ట్ ఆప్షన్.
పనీర్ - కరివేపాకు
పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 100 గ్రాముల పనీర్‌లో 200-250 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. ఇది దంతాలకే కాకుండా నరాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు పనీర్ కూరలు లేదా స్నాక్స్ చేసేటప్పుడు అందులో కాస్త కరివేపాకు దట్టించి వండితే పోషకాలు రెట్టింపు అవుతాయి.
బాదం - కరివేపాకు
శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడంలో బాదం అద్భుతంగా పనిచేస్తుంది. 100 గ్రాముల బాదంలో 264 మి.గ్రా కాల్షియంతో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం ఉంటాయి. కరివేపాకు, బాదం పప్పులు కలిపి చట్నీ చేసుకోవచ్చు లేదా మీరు తినే సలాడ్స్ పై వీటిని చల్లుకుని తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
మునగాకు - కరివేపాకు
మునగాకులో ఉండే కాల్షియం మరే ఆకుకూరలోనూ ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. 100 గ్రాముల మునగాకులో ఏకంగా 440 మి.గ్రా కాల్షియం ఉంటుంది.
వయసు పైబడే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారడం) సమస్యకు ఇది చెక్ పెడుతుంది. మునగాకు, కరివేపాకు కలిపి కూర వండుకుని లేదా వేపుడు చేసుకుని తరచుగా తింటే మీ ఎముకలు ఇనుములా మారతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications