Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పీరియడ్స్ లో నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి
మహిళల జీవితంలో పీరియడ్స్ కామన్. ప్రతి నెలా వచ్చే ఆ ఐదు రోజులు.. మహిళల జీవితంలో అదొక ప్రత్యేక అధ్యాయం. ప్రకృతి మనకిచ్చిన ఈ వరం, మన ఆరోగ్యం సక్రమంగా ఉందని చెప్పే ఒక ముఖ్యమైన సూచిక. అయితే ఈ వరం కొన్నిసార్లు శాపంగా మారుతుంది. భరించలేని నడుము నొప్పి, కడుపులో తిప్పేసినట్లుండే మంట, నీరసం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు శరీరాన్ని, మనసును ఒకేసారి కుదిపేస్తాయి. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న అమ్మాయిలకు ఈ నొప్పి నరకాన్ని చూపిస్తుంది. అయితే చిన్నపాటి జీవనశైలి మార్పులు, కొన్ని సులభమైన చిట్కాలతో ఈ నొప్పిని అదుపులో ఉంచి, ఆ రోజులను కూడా ప్రశాంతంగా గడపవచ్చు.
నడుము నొప్పి వెనుక అసలు కారణం?
పీరియడ్స్ టైంలో నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణం ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్. గర్భాశయ పొరను బయటకు పంపడానికి గర్భాశయం బలంగా సంకోచించేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తుంది. ఈ సంకోచాల ప్రభావం గర్భాశయానికి దగ్గరగా ఉండే నడుము, తొడ కండరాలపై పడి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఇది సాధారణమే అయినప్పటికీ నొప్పి భరించలేనంతగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ (గర్భాశయ కణజాలం వేరే చోట పెరగడం) లేదా ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు కూడా ఈ నొప్పిని తీవ్రతరం చేస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక నొప్పి ఉంటే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలవడం బెటర్.

నొప్పిని తగ్గించే హోం రెమెడీస్
-ఒక హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటి సంచిని నడుముపై, పొత్తికడుపుపై ఉంచడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేడి వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, బిగుసుకుపోయిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
-పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయకూడదని చాలామంది అనుకుంటారు, కానీ అది అపోహ మాత్రమే. యోగా, పైలేట్స్, చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు, నెమ్మదైన నడక వంటివి కండరాలను మృదువుగా చేసి, నొప్పిని, మంటను తగ్గించడంలో మ్యాజిక్ లా పనిచేస్తాయి.
-పీరియడ్స్ సమయంలో తీసుకునే ఆహారం నొప్పి తీవ్రతను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తినాలి. అరటిపండు, డార్క్ చాక్లెట్ వంటి మెగ్నీషియం అధికంగా ఉండే పదార్థాలు కండరాల నొప్పిని తగ్గిస్తాయి. అల్లం, పసుపు వంటివి సహజ నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. అదే సమయంలో ఉప్పు, చక్కెర, కెఫిన్, ఫ్యాటీ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం మేలు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం.
-పీరియడ్స్ సమయంలో శరీరానికి సౌకర్యం చాలా అవసరం. బిగుతైన జీన్స్ లేదా ఇతర దుస్తులు పొత్తికడుపుపై ఒత్తిడిని పెంచి, నొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. వాటికి బదులుగా వదులుగా, గాలి ఆడేలా ఉండే కాటన్ దుస్తులను ధరించడం ఉత్తమం.
-ఒత్తిడి, ఆందోళన వంటివి నొప్పిని మరింత తీవ్రంగా అనిపించేలా చేస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో మీకు నచ్చిన పనుల్లో మునిగిపోవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications