Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రోజులో ఎన్ని గంటలు ఏసీ ఆన్ లో ఉండాలో తెలుసా!..ఎక్కువ సేపు రన్ చేస్తే ఏమవుతుంది?
ఒకప్పుడు ఎవరింట్లో అయినా ఏసీ ఉంటే అదేదో ఒక లగ్జరీ వస్తువులా ఫీల్ అవుతుండేవాళ్లు. అయితే ఇప్పుడు ఏసీ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏసీ లేకుంటే కష్టంరా బాబు అని సంపాదనతో తేడా లేకుండా అందరూ భావిస్తున్నారు. ఇక ఎండాకాలంలో అయితే మండిపోయే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న వేసవిలో ఎయిర్ ఏసీ ఒక వరంలా అనిపిస్తుంది. బయట అగ్నిగుండంలా ఉన్నా, ఏసీ బటన్ నొక్కగానే స్వర్గంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అయితే ఏసీకి అలవాటు పడి చాలామంది పగలూ రాత్రీ తేడా లేకుండా గంటల తరబడి ఏసీలోనే గడిపేస్తుంటారు.
అయితే కంటిన్యూగా ఏసీ రన్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి, జేబుకు తెలియకుండానే పెద్ద చిల్లు పడుతుందని మీకు తెలుసా? ఏసీని అతిగా వాడటం వల్ల కలిగే నష్టాలు అనేకం. మరి ఏసీని ఎంతసేపు వాడాలి? ఎలా వాడాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

అతి వాడకం..అనారోగ్యాలకు ఆహ్వానం
ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజుకు 6 నుండి 8 గంటలు ఏసీ వాడటం సురక్షితం. అంతకుమించి ఎక్కువసేపు ఏసీ రూమ్ లో ఉండటం వల్ల మన శరీరం తన సహజ ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తిని కోల్పోతుంది. ఏసీ.. గదిలోని తేమను పూర్తిగా పీల్చేస్తుంది, దీనివల్ల గాలి పొడిగా మారుతుంది. ఈ పొడి గాలి మన చర్మాన్ని నిర్జీవంగా మార్చడమే కాకుండా కళ్ళు పొడిబారడం, ముక్కు, గొంతులో చికాకు, పొడి దగ్గు వంటి సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా సైనస్ వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
జేబుకు చిల్లు, పర్యావరణానికి ముప్పు
ఏసీని గంటల తరబడి రన్ చేయడం వల్ల కరెంట్ బిల్లు మోత మోగిపోతుంది. కరెంటు బిల్లు రూపంలో మన జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది. అంతేకాకుండా అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలను ఎక్కువగా వాడాల్సి వస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుంది. అంటే మన సౌకర్యం కోసం పర్యావరణాన్ని పణంగా పెడుతున్నామన్నట్లే.
ఇలా వాడితే రెట్టింపు ప్రయోజనాలు
పట్టపగలు, అత్యంత వేడిగా ఉండే సమయంలో 6-8 గంటలు మాత్రమే ఏసీని ఉపయోగించండి. రాత్రిపూట నిద్రపోయే ముందు 2-3 గంటల పాటు టైమర్ సెట్ చేసుకోండి. గది చల్లబడిన తర్వాత ఏసీ దానంతట అదే ఆగిపోతుంది, కానీ చల్లదనం చాలాసేపు నిలిచి ఉంటుంది. ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు గది తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూసుకోండి. దీనివల్ల చల్లదనం బయటకు పోకుండా విద్యుత్ ఆదా అవుతుంది. ఏసీ వాడేటప్పుడు చర్మానికి మంచి మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications