Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సమ్మర్ లో ప్రతిరోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఎండల వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఏదైనా చల్లగా తినాలని మనకు సాధారణంగా అనిపిస్తుంటది. అయితే ఈ సమయంలో చాలామంది ఐస్ క్రీం, చెరుకు రసం, పచ్చకాయ వంటి రకరకాల చల్లటి పదార్థలు తింటుంటారు. అయితే వీటన్నింటికన్నా పెరుగు తినడం ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.పెరుగు..శరీరాన్ని చల్లబరచ్చడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వాస్తవానికి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే అని మనకు తెలిసినప్పటికీ ఎండాకాలంలో ప్రతి రోజూ దీన్ని తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయంట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది
పెరుగులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎండాకాలంలో శరీరరం కోల్పోయిన తేమని తిరిగి నింపడానికి సహాయపడుతుంది.

తక్షణ శక్తి
పెరుగులో ఉండే పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవిలో నీరసంగా అనిపించకుండా చేస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
సాధారగా సమ్మర్ సీజన్ లో గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
నోటి పూతల నుంచి రిలీఫ్
వేసవిలో నోటి పూతల సమస్య ఎక్కువగా వస్తుంది. పెరుగు చల్లగా ఉండటం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తద్వారా నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గడానికి బెస్ట్
బరువు తగ్గాలనుకునేవాళ్లకి పెరుగు గొప్ప ఆహారం. ఓ పరిశోధన ప్రకారం పెరుగులో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్ కారణంగా ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీని వల్ల అతిగా తినడం తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుదల
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)ప్రకారం.. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎండాకాలంలో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడానికి పెరుగులోని పోషకాలు, ప్రోబయోటిక్స్ సహాయపడతాయి.
చర్మానికి మేలు
పెరుగుని ముఖానికి పట్టించడం వల్ల చర్మంపై ఏర్పడిన టానింగ్ తగ్గుతుంది,చల్లగా అనిపిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.పెరుగుని శనగపిండి,పసుపుతో కలిసి ముఖానికి రాయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, చర్మానికి సహజమైన కాంతి వస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది
కొన్ని అధ్యయనాల ప్రకారం పెరుగు తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవల్స్ మెరుగుపడతాయి. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల ప్రభావం తగ్గుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications