Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Beer vs Whisky: బీర్ సేఫా? విస్కీ బెటరా? మందుబాబులు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు!
మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఆఖరికి అది ఉండే బాటిల్ మీద కూడా హెచ్చరిక ఉంటుంది. అయితే మద్యం ప్రియులకు లైట్ లే అనుకుంటూ నచ్చిన మందును ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో పార్టీల్లో లేదా వీకెండ్స్ లో ఫ్రెండ్స్ నలుగురు ఒక చోట చేరిన సమయంలో తరచుగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంటుంది. హార్డ్ లిక్కర్ అయిన విస్కీ కంటే, లైట్ గా ఉండే బీర్ తాగడం ఆరోగ్యానికి అంతగా హాని చేయదు అని చాలా మంది బలంగా నమ్ముతారు. ఇందులో నిజమెంత? ఈ విషయంలో నిపుణులు చెబుతున్న వాస్తవాలు ఇక్కడ చూడండి.

నిపుణుల మొదటి మాట ఒక్కటే!
బీర్ అయినా లేదా విస్కీ అయినా లేదా బ్రాందీ అయినా ఆల్కహాలు ఏదైనా సరే అది శరీరానికి చేటు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. మోతాదు తక్కువే కదా అని తీసుకున్నా, దాని వల్ల పొంచి ఉన్న ప్రమాదం మాత్రం తగ్గదు. కాబట్టి ఈ రెండింటిలో ఏది మంచిది అనేదాని కంటే, దేని వల్ల ఏయే నష్టాలు లేదా స్వల్ప లాభాలు ఉన్నాయో పోల్చి చూసుకోవడం ముఖ్యం.
ఆల్కహాల్ శాతం - ప్రమాదం ఎందులో ఎక్కువ?
సాధారణంగా బీర్ లో 4 నుంచి 6 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుంది. అదే విస్కీ విషయానికి వస్తే ఇది దాదాపు 40 శాతంగా ఉంటుంది. ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది కదా అని చాలా మంది బీర్ ను మంచినీళ్లలా లీటర్ల కొద్దీ తాగేస్తుంటారు. ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. బీర్ ను మోతాదుకు మించి తాగడం వల్ల, శరీరంలోకి వెళ్లే మొత్తం ఆల్కహాల్ పరిమాణం అమాంతం పెరిగిపోతుంది. మరోవైపు, విస్కీలో ఆల్కహాల్ శాతం ఎక్కువ కాబట్టి, కొద్దిగా తీసుకున్నా సరే దాని ప్రభావం శరీరంపై చాలా బలంగా ఉంటుంది.
బీర్ తాగితే బొజ్జ గ్యారెంటీనా?
బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా కేలరీల గురించి ఆలోచించాలి. ఒక పింట్ బీర్ లో సుమారు 150 నుంచి 200 కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. అందుకే తరచుగా బీర్ తాగే వారిలో త్వరగా పొట్ట వచ్చేస్తుంది. అదే విస్కీ విషయానికి వస్తే.. ఒక పెగ్గు (30 ml) విస్కీలో కేవలం 70 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, చక్కెర అస్సలు ఉండవు. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి బీర్ కంటే విస్కీ కొంత బెటర్ ఆప్షన్. అలాగని విస్కీ బరువు తగ్గిస్తుందని కాదు.
ఆరోగ్యానికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?
అతి పరిమితంగా తీసుకుంటే ఈ రెండింటిలోనూ కొన్ని స్వల్ప ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
బీర్
ఇందులో పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కొంతవరకు సహాయపడతాయని చెబుతారు.
విస్కీ
విస్కీలో ఎలాజిక్ యాసిడ్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
