Latest Updates
-
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.!
మగవారు గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా?.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు?
గడ్డం అనేది ఒక స్టైల్‌తో పాటు స్టేటస్ సింబల్‌గా చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది మగవారు గడ్డం పెంచడానికి ఇష్టపడుతుంటారు. యువత ఇదొక ట్రెండ్‌గా భావించి గడ్డం పెంచుకుంటారు. అయితే గడ్డం పెంచుకోవడం వల్ల అందంగా కనిపించడం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచి ప్రయోజనాలు దొరుకుతాయి. అసలు గడ్డం పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యూవీ కిరణాల నుంచి రక్షణ
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు(యూవీ రేస్) చాలా ప్రమాదకరమన్న విషయం తెలిసిందే. ఈ కిరణాలు మన శరీరంపై పడితే చర్మ సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గడ్డం పెంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. గడ్డం పెంచుకోవడం వల్ల.. ఆ గడ్డం చర్మాన్ని కవర్ చేస్తుంది. దీంతో యూవీ కిరణాలు చర్మంపై పడవు. తద్వారా యూవీ కిరణాల నుంచి వచ్చే సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు.

చర్మం పొడిబారకుండా ఉంటుంది..
చలికాలంతో పాటు వేసవి కాలంలో కూడా చర్మం సాధారణనంగా పొడి బారుతూ ఉంటుంది. దీని కారణంగా చర్మం పగిలిపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే గడ్డం ఉండడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ దొరుకుతుంది. తద్వారా చర్మం పొడి బారకుండా ఉంటుంది. అలాగే చర్మం పగుళ్ళను నివారించుకోవచ్చు.
గొంతు సమస్యలు దూరం..
సాధారణంగా గాలిలో ఎన్నో బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఉంటాయి. అయితే గడ్డం ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియాలు, వైరస్‌లు నోటిలోకి అంత సులభంగా ప్రవేశించవు. దీంతో గొంతు సమస్యలు, జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. గడ్డం పెంచుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.
ముడతలు రావు..
మారిపోయిన జీవన శైలి కారణంగా చాలా మందిలో చాలా తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖంపై ముడతలు మొటిమలు వంటివి చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే గడ్డం పెంచుకోవడం వల్ల ఆ సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గడ్డం ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే మనిషిని యవ్వనంగా కనిపించే విధంగా ప్రేరేపిస్తుంది. దీంతో చర్మం అందంగా, వయసు తక్కువగా కనిపిస్తుంది.
రాయల్ స్టేటస్..
గడ్డ ఉన్న వ్యక్తులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వారి ముఖంలో తేజస్సు, రాజసం కనిపిస్తుంటుంది. అందుకే గడ్డం ఉండే వ్యక్తులకు సమాజంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. పెద్ద మనిషి మాదిరిగా వారిని గౌరవిస్తూ ఉంటారు. ఎదో తెలియని ఆత్మవిశ్వాసం కూడా వారిలో పరిఢవిల్లుతుంది. గడ్డం ఉండడం వల్ల అందం, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సమాజంలో గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది.
అలా అని గడ్డం ఎలా పడితే అలా, పెంచకూడదు. గడ్డంను కూడా నీటిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా పెరగకుండా మరీ చిన్నగా అవ్వకుండా మెయింటైన్ చేయాలి. అప్పుడే అందంగా కనిపిస్తాము. అలా అని ఎలా పడితే అలా పెంచేస్తే మాత్రం పిచ్చోడిలాగా కనిపిస్తాము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications