Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
గుడ్లు ఉడకబెట్టిన నీటిని పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే జీవితంలో పడేయరు
మనమందరం ఉడకబెట్టిన గుడ్లను తింటూ ఉంటాము. గుడ్డును ఉడకబెట్టడానికి నీళ్లు పోసి, అందులో కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతాము. గుడ్లు ఉడికిన తరువాత ఆ నీళ్లను పారేస్తుంటాము. అయితే గుడ్లను ఉడకబెట్టడానికి వినియోగించే నీటితో అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో చాలా శక్తి ఉంటుందట. గుడ్డులోని చాలా పోషకాలు బయటికి వచ్చి ఆ కలుస్తాయట. ఇంతకీ గుడ్డు ఉడికించిన నీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వాటిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మొక్కల కోసం
గుడ్లను ఉడకబెట్టినప్పుడు అందులోని కొన్ని పోషకాలు పెంకు ద్వారా బయటికి వచ్చి నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కలిగిన పోషకాలు నీటిలో కలిసిపోతాయి. కాబట్టి ఆ నీళ్లను మొక్కలకు పోస్తే, మొక్కలకు సరైన మోతాదులో పోషకాలు అందుతాయి. మొక్కలు వేపుగా, బలంగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మొక్క పచ్చగా ఉండేందుకు సహాయపడతాయి.

జుట్టు అందం కోసం
చాలా మందికి జుట్టు రాలే సమస్య ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది. దానిని పరిష్కరించుకోవడానికి చాలా మంది నానారకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. అయితే గుడ్లు ఉడకబెట్టిన నీటితో జుట్టును శుభ్రం చేసుకోవడం వలన.. జుట్టు కుదుళ్ళు బలపడతాయి. దీనివల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. దీంతో పాటు చుండ్రు కూడా తగ్గిపోతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా తయారవుతాయి. మిలమిలా మెరిసిపోతాయి.
గ్రీజు వదిలించుకోవడానికి
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రీజ్, దుమ్ము, ధూళి పెద్ద చిరాకును తెప్పిస్తాయి. అయితే గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు వాటిని పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. గుడ్లు ఉడకబెట్టిన నీటిలో ఆల్కలైన్ స్వభావం ఉంటుంది. ఇవి పట్టుకున్న జిడ్డును వదిలించుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిని వినియోగించి వంటగది ప్లాట్‌ఫాం, స్టవ్, డిష్ వాషర్ వంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఇవి వాటికి అంటుకున్న జిడ్డు మురికి తొలగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడతాయి. ఈసారి మీరు గుడ్లు ఉడకబెట్టినప్పుడు ఆ నీటిని పడేసే ముందు ఓసారి ఇలా ట్రై చేయండి. కచ్చితంగా మీకు ఉపయోగం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications