Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
Chia Seeds Benefits: ఆరోగ్యంగా ఉండాలన్నా.. పడకగదిలో రెచ్చిపోవాలన్నా.. చియా సీడ్స్ బెస్ట్ ఆప్షన్
చియా విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే జనాలకు తెలిసి వస్తుంది. అందుకే న్యూట్రిషనిస్టులు కూడా ఆహారంలో చియా విత్తనాలు భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడేవారికి చియా విత్తనాలు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
చియా విత్తనాలు తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సరైన రీతిలో చియా సీడ్స్ తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, కోరికలు పెరుగుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యానికి చియా విత్తనాలు మంచివని వైద్యులు చెబుతున్నారు.

చియా విత్తనాల్లోని పోషక విలువ:
మాలిక్యూల్ జర్నల్ ప్రకారం, చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. చియా సీడ్స్‌లో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్, మైరిసెటిన్, క్వెర్సెటిన్ సమ్మేళనాలు కూడా ఇందులో ఉన్నాయి. చియా సీడ్స్ లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ లైంగిక కోరికను పెంచుతాయి.
లైంగిక కోరికను ఎలా పెంచుతాయి:
ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం, చియా విత్తనాలు సరైన మొత్తంలో తీసుకుంటే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది పురుషుల్లో లైంగిక కోరికను పెంచుతుంది. విత్తనాలు శరీరం ఉత్పత్తి చేయలేని ఒమేగా-3 వంటి ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటాయి. ఇవి సహజంగా టెస్టోస్టేరాన్ ను పెంచడానికి సహాయపడతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ సెక్స్ పట్ల కోరికను పెంచడంతో పాటు సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తుంది. ఈ హార్మోన్ వల్ల ఎక్కువ సేపు శృంగారం చేసిన అలసట రాదు.
ఆడవారి పునరుత్పత్తి ఆరోగ్యం:
జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చియా విత్తనాలపై ప్రచురించిన పరిశోధనా కథనాలు కూడా మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ఇది ప్రయోజనకరమైనదని వివరించాయి. చియా సీడ్స్ లో అధిక స్థాయిలో ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఉంటయి. ఈ పోషకాలన్నీ శిశువుల మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి.
తల్లిపాల కోసం చియా సీడ్స్:
చియా విత్తనాలు తీసుకుంటే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజూ చిటికెడు చియా గింజలను తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది.
సంతానోత్పత్తిని పెంచుతుంది:
జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం, చియా విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భధారణకు మేలు చేస్తాయి. శరీరంలో ఆరోగ్యకరమైన అండాలు, ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. చియా విత్తనాల్లోని పోషకాలు హార్మోన్లను నియంత్రిస్తాయి. పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతాయి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications