Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పరిగడపున సబ్జగింజల నీళ్లు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుకోవడచానికి ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇంట్లో వుండే పదార్ధాలతోనే శరీరానికి కావాల్సిన పోషకాలను అందించవచ్చు. ఈ ఎండాకాలంలో శరీరం చల్లదనం కోసం రకరకాల జ్యూస్‌లను బయట కొనుక్కొని తాగుతుంటాము. వాటి వల్ల డబ్బు వృధా అవడమే కాకుండా వాటిలో వుండే చెక్కర పదార్ధంతో బరువు పెరిగే అవకాశాలున్నాయ్. ఈ వేసవిలో చలువ కోసం సబ్జ గింజల పానియాన్ని రోజూ తాగాలి. సబ్జ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు, శరీరానికి అందే పోషకాలు గురించి తెలుసుకుందాం.
సబ్జ గింజల పానియాన్ని ఇలా తయారు చేసుకోవాలి :
ఉదయం పరిగడపున సబ్జగింజల నీళ్లను తాగడానికి ముందుగా ఒక పిడికెడు సబ్జగింజలను చేతిలో తీసుకోవాలి. వాటిలో ఏవైనా రాళ్లు వుంటే తీసి పారేయాలి. వాటిని మళ్లీ నీళ్లల్లో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తీసుకొని వాటిలో ఈ గింజలను వేసి నానబెట్టాలి. తరువాత వీటిిని ఒక గ్లాసు నీళ్లల్లో తీసుకొని పరిగడపునే ఉదయం బ్రష్ చేయగానే తాగాలి.
జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది
సబ్జ గింజల్లో ఫైబర్ శాతం సంమృద్దిగా వుండడం వల్ల కడుపులో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం లేవగానే తాగడం వల్ల కడుపును కూడా శుభ్రంగా వుంచుతుంది. కడుపులో వుండే వ్యర్థపదార్ధాలు బయటకు వెళ్లడానికి సహాయం చేస్తుంది.
బరువు తగ్గించడంలో దోహదపడుతుంది
సబ్జ గింజల నీళ్లు తాగడం వల్ల కడపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో తక్కువ ఆహారాన్ని తీసుకొంటారు. ఇలా పరోక్షంగా బరువును సబ్జగింజలు తగ్గిస్తాయ్. ప్రతి రోజు భోజనం చేసే ఒక గంట ముందు సబ్జ గింజల పానియం తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

గుండెకు మంచిది
సబ్జ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయ్. ఇవి ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయ్. దీని ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి రోజుకు కనీసం ఒక టీ స్పూన్ సబ్జ గింజలనైనా తాగే ప్రయత్నం చేయండి.
షుగర్ స్థాయిని అదుపులో వుంచుతుంది
రక్తంలో ఇన్సులిన్ స్థాయిని సబ్జ గింజలు మెరుగుపరుస్తాయ్. మధుమేహం ఉన్న వారికి సబ్జ గింజలు చాలా దోహదపడతాయ్.
ఆకలిని తగ్గిస్తుంది
ఆకలి ఎక్కువగా ఉండే ఏదిపడితే అది తిని బరువు పెరిగే అవకాశాలుంటాయ్. రోజూ ఒక గ్లాసు సబ్జ గింజలు తాగడం వల్ల ఆకలి వేయదు. దీంతో బరువు కూడా అదుపులోకి వస్తుంది.
డీహైడ్రేషన్ కు దూరంగా
సబ్జ గింజలు శరీరాన్ని చల్లగా వుంచడం వల్ల డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయ్. ఒక గ్లాసు నీటిలో కొన్ని సబ్జగింజలను వేసుకొని ఎండాకాలంలో ప్రతీ రోజు తాగితే దాని ఫలితాన్ని మీరు వెంటనే చూడగలుగుతారు.
సబ్జ గింజల నీటిలో తేనె, నిమ్మరసాన్ని కూడా కలుపుకొని తాగితే రుచి మాత్రమే కాకుండా ఇంకా ఇతర పోషకాలు కూడా అందుతాయ్.
మలబద్దకం
ఆహారం సరిగ్గా జిర్ణం కాక మలబద్దకంతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో సబ్జగింజలను వేసుకొని తాగాలి. ప్రతీ రోజు పడుకునే ముందు ఇలా కొన్న సబ్జ గింజలను వేసుకొని తాగడం వల్ల ఉదయం మలబద్దకం సమస్యతో బాధపడుకుండా వుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications