Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Ragi Java: వేసవిలో రాగి జావ తాగితే ఎనర్జీతో పాటు ఆరోగ్యం కూడా..
వేసవికాలంలో త్వరగా నీరసించిపోతారు. ఎండలో కాసేపు అలా వెళ్లివచ్చారంటే ఎనర్జీ అంతా కోల్పోయి నీరసంగా మారిపోతారు. అలాగే ఎండాకాలంలో ఏమీ తినాలనిపించదు. ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అలా అని ఏదీ తినకుండా ఉంటే త్వరగా నీరసించిపోతాం. ఎండాకాలంలో డీహైడ్రేషన్ కు గురికావడం, వడదెబ్బ బారిన పడటం ఎక్కువగా జరుగుతుంది.
వేసవికాలంలో ఉదయం తీసుకునే ఆహారం రోజంతా హుషారుగా పని చేయడానికి కావాల్సిన శక్తిని అందించేలా ఉండాలి. అందుకే వేసవి కాలంలో రాగి జావ తాగాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తుంటారు.దీని వల్ల తక్షణ శక్తి రావడంతో పాటు, రోగనిరోధక శక్తి మెరుగుపడటం, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

రాగుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీస్ ప్రకారం. 100 గ్రాముల రాగుల్లో ఎన్ని పోషకాలు ఉంటాయంటే..
* ప్రోటీన్ 7.6 గ్రా.
* ఫ్యాట్ 1.5 గ్రా.
* కార్బొహైడ్రేట్ 88 గ్రా.
* కాల్షియం 370 మి.గ్రా.
* విటమిన్లు - A: 0.48 మి.గ్రా.
* థియామిన్ (B1): 0.33 మి.గ్రా.
* రిబోఫ్లావిన్ (B2): 0.11 మి.గ్రా.
* నియాసిన్ (B3): 1.2 మి.గ్రా.
* ఫైబర్ 3 గ్రా
రాగి జావ ఆరోగ్య ప్రయోజనాలు:
కాల్షియం సమృద్ధిగా ఉంటుంది:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీస్ ప్రకారం, ఇతర మిల్లెట్లు ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలు కాకుండా కాల్షియం ఎక్కువగా ఉండేది రాగుల్లోనే.
డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది:
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. జీర్ణక్రియ వేగాన్ని మెయింటైన్ చేస్తుంది. రక్తంలో చక్కెర పరిధిని నియంత్రణలో ఉంచుంతుంది.
రక్తహీనతతో పోరు:
రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వారు, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్న వారికి రాగి జావ ఒక వరం లాంటిది. ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయం:
రాగుల్లో అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల ఆకలి తగ్గుతుంది. ఇలా బరువు తగ్గడానికి దారితీస్తుంది.
చర్మం సంరక్షణ:
రాగుల్లో ఉండే మెథియోనిన్, లైసిన్ వంటి కీలక అమైనో ఆమ్లాలు చర్మ కణజాలాన్ని కాపాడతాయి. చర్మం ముడతలు పడకుండా చూస్తాయి.
శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది:
ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమితో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా రాగులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని మెడ్ ఇండియా 2000లో నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.
గ్లూటెన్ ఉండదు:
గోధుమలతో పోలిస్తే రాగులు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఇందులో గ్లూటెన్ ఉండదు. ఇది శరీరంలో మరింత ఆల్కలీన్ మీడియంను సృష్టిస్తుంది.
రాగి జావ తయారీ విధానం:
* రాగి పిండిని ముందుగా కొన్ని నీళ్లలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
* మరో గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి స్టవ్ పై పెట్టుకోవాలి.
* నీళ్లు మరిగేటప్పుడు ముందుగా నీటిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ నీటిలో వేసుకోవాలి.
* తగినంత ఉప్పు, తగినంత మజ్జిగ వేసుకోవాలి.
* ఆ మిశ్రమం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి.
* తర్వాత స్టవ్ పై నుండి దించి చల్లార్చుకోవాలి.
* కొత్తిమీర, పుదీనా వేసుకుంటే రాగి జావ సిద్ధమైనట్లే.
* కొద్దిగా కారంగా కావాలనుకుంటే కారం వేసుకుని రాగి జావను తాగొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications