Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
శృంగారంలో రేసు గుర్రమైపోవాలంటే..ఈ 2 తింటే చాలు
శృంగారం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ లో శృంగార సంబంధిత సమస్యలు సర్వసాధారణమైపోయాయి. తరచుగా శృంగారంలో పాల్గొనకపోవడం, పాల్గొనాలన్న కోరిక లేకపోవడం, స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉండటం, శృంగారం మొదలుపెట్టిన నిమిషానికే ఔట్ అయిపోవడం ఇలా రకరకాల సమస్యలతో సెక్స్ నిపుణులు, డాక్టర్ల దగ్గరకు వెళ్లే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
అయితే ఈ సమస్యలకు అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే ఇందులో ప్రధానమైన కారణాలు లైఫ్ స్టైల్, టెన్షన్,ఆహార అలవాట్లు. ఈ బిజీ లైఫ్ లో అటు ఇటూ తిరుగుతూ ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు చాలామంది..అదేవిధంగా ఆఫీసులో లేదా ఫ్యాక్టరీలో పని ఒత్తిడి,ఇతర సమస్యల వల్ల టెన్షన్,ఒత్తిడికి లోనవుతున్నారు కొందరు. ఇవన్నీ లైంగిక జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.

మీరు మీ లైంగిక జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, మీ శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే ఖర్జూరాలు,గుమ్మడికాయ గింజలను తినండి. ఇవి సెక్స్ లైఫ్ ని ఉత్తేజకరమైనదిగా మార్చడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలు లైంగిక ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లో జింక్ ఉంటుంది, ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం గుమ్మడికాయ గింజలు లిబిడోను పెంచడంలో సహాయపడతాయి. వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి ప్రోస్టాగ్లాండిన్స్ అని పిలువబడే హార్మోన్-వంటి మూలకాలను సక్రియం చేయడంలో సహాయపడతాయి. ఈ అంశాలు లైంగిక జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఇది కాకుండా ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ లోపాన్ని కూడా తొలగిస్తుంది.గుమ్మడి గింజలు కూడా గర్భధారణకు సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలను వేయించి చిరుతిండిగా తినవచ్చు లేదా వాటి నుండి కూర తయారు చేసి తినవచ్చు.
ఖర్జూరం
ఖర్జూరాలు మెరుగైన లైంగిక జీవితానికి దివ్యౌషధంగా కూడా పరిగణించబడ్డాయి. ఖర్జూరం ఆరోగ్యానికి మాత్రమే కాదు లైంగిక ఆరోగ్యానికి కూడా దివ్యౌషధం. ఖర్జూరం తినడం సెక్స్ జీవితాన్ని మెరుగుపరుస్తుందని చాలా అధ్యయనాలు తెలిపాయి. ఖర్జూరం సెక్స్ స్టామినాను పెంచే అమినో యాసిడ్‌లను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు నైజీరియాలో ఖర్జూరం కామోద్దీపన పండ్ల కేటగిరీలో ఉంచబడుతుంది. కాబట్టి మీరు మీ లైంగిక జీవితాన్ని ఉత్తేజపరిచేలా చేయాలనుకుంటే రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలు, ఖర్జూరాలను తప్పక చేర్చుకోండి.
గమనిక: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications