Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇవి తింటే మందులు వాడకుండానే ఒబేసిటీ తగ్గిపోతుంది.. 100% ప్రూవెన్
ఈ మధ్యకాలాంలో చాలా మంది భారతీయులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ఉభయకాయం. ఉభయకాయం. దీని కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికంగా బరువు పెరిగిపోవడం, గుండెపోటు, సారైనా జీవన శైలి లేకపోవడం వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. దాని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి సరైన ఫలితాలు మాత్రం రావడం లేదు. ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది.
ఊబకాయం వేగంగా పెరుగుతున్న ఒక పెద్ద సమస్యగా క్రమక్రమంగా మారడం వలన.. ఇది శరీర రూపాన్ని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఊబకాయం వల్ల కొవ్వు కాలేయం, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. బరువు తగ్గాలని లేదా నియంత్రణ చేయాలని అనుకుంటే ఆహారంలో మొలకలు చేర్చుకోవడం మంచి అలవాటుగా మారవచ్చు. అల్పాహారంలో మూంగ్, పప్పు, సోయాబీన్, వేరుశెనగలను నానబెట్టి మొలకలు తయారు చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఆహారాన్ని మన డైట్‌లో భాగం చేసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసుకుంటే ఉబయకాయాన్ని తగ్గించుకోవచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెంతిగింజలు
ఉబయకాయం నుంచి ఉపశమనం కోసం ఆరోగ్య నిపుణులు ప్రోటీన్ అధికంగా ఉండే మొలకలు తినాలని సిఫారసు చేస్తున్నారు. అల్పాహారంలో మొలకలు తీసుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు. అందుకే డైట్‌లో మెంతి గింజలు చేర్చుకోవడం మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఇవి శరీరానికి అమృతం లాగా పనిచేస్తాయి. ఇవి బరువు తగ్గించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. మెంతి గింజలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వాటిలోని మూలకాలు ఆకలిని తగ్గించి, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. శరీరంలోని జీవక్రియను కూడా పెంచుతాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం మంచిది.
గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివిగా చెప్పుకోవచ్చు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇవి మనిషిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. గుడ్లలో ఉన్న ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది, కడుపు సాటిన అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల, గుడ్లను అల్పాహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
పండ్లు, గంజి
పండ్ల వాడకం ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అయితే, పండ్లను అల్పాహారంలో భాగంగా తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. పండ్లలో ఫైబర్ అధికంగా ఉండడం వలన అవి కడుపును సంతృప్తి కలిగించడంలో సహాయపడతాయి. పండ్లు శరీరాన్ని శుభ్రపరచి, విటమిన్లను సమృద్ధిగా అందిస్తాయి.
గంజి కూడా బరువు తగ్గటానికి అనుకూలమైన ఆహారం. ఇది ఫైబర్ మరియు ప్రోటీన్లతో నిండి ఉంటుంది. గంజి తినడం శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. మీరు గంజి తింటే, దీనిలో వివిధ కూరగాయలను జోడించవచ్చు, రుచిని పెంచుకోవచ్చు. పాలతో కూడా గంజి తయారు చేసి తినవచ్చు, అయితే ఇందులో స్కిమ్డ్ మిల్క్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే, చక్కెర లేకుండా గంజి తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications