Weight Loss Tips: ఈ దుంపకూరలను ఇలా తింటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు

అధిక బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు స్టార్చ్, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటారు. అందుకే దుంప కూరలను తమ డైట్ లో భాగం చేసుకోరు. కేలరీలను తక్కువ తీసుకోవడం, గ్లైసెమిక్ ఇండెక్్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు.

అయితే రూట్ వెజిటెబుల్స్ ను సరిగ్గా తింటే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రూట్ వెజిటెబుల్స్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సహా ఇతర పోషకాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఎలా వండాలో, ఎలా తినాలో తెలిసి ఉండాలి. బరువు తగ్గడానికి దుంప కూరలను ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Root Vegetables For Weight Loss Details In Telugu

1. క్యారెట్:
క్యారెట్లు ప్రోటీన్లకు మంచి మూలం. క్యారెట్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. డైటరీ ఫైబర్, విటమిన్ ఏ, సీ, పొటాషియం, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లను నేరుగా తినొచ్చు. సూప్‌లు, సలాడ్‌లు, రోస్ట్, గ్రిల్ సహా వండుకుని తినొచ్చు. 100 గ్రాముల క్యారెట్లలో కేవలం 41 కేలరీలు మాత్రమే ఉంటాయి.

2. ఉల్లిపాయ:
వంటకం ఏదైనా అందులో ఉల్లిపాయ లేకపోతే రుచి రాదు. ఉల్లిపాయలను పచ్చిగా కూడా తినొచ్చు. కూరలు తయారీలో ఉల్లిపాయల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయల్లో ప్రీబయోటిక్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

3. చిలగడదుంపలు:
స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు ఆకలి తగ్గుతుంది. కొవ్వు, ప్రోటీన్ యొక్క జీర్ణక్రియను ప్రేరేపించే కోలిసిస్టోకినిన్ ఉంటుంది. చిలగడదుంపలోని రెసిస్టెంట్ స్టార్చ్ ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. అల్లం:
అల్లం జీర్ణ క్రియ, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అల్లం శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది.

5. బీట్‌ రూట్‌:
బీట్ రూట్‌ లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌ రూట్‌ ను సలాడ్, స్మూతీ, జ్యూస్, బేక్డ్ చిప్స్ గా తయారు చేసుకుని తినొచ్చు.

బరువు తగ్గించేందుకు దుంపకూరలు అదనపు సహాయాన్ని చేస్తాయి. అయితే దుంపకూరలు వండేటప్పుడు నీటి ఆవిరిపై ఉడికించి లేదా కాల్చి తీసుకోవడం మంచిది. నూనెలో వేయిస్తే దీనికి అదనపు కేలరీలు జోడించబడి అది బరువు పెరగడానికి దారి తీస్తుంది.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Thursday, May 11, 2023, 10:05 [IST]
Desktop Bottom Promotion