Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Meal time: ఆరోగ్యంగా ఉండాలంటే ఏ టైంలో తినాలి? ఈ సమయంలో తింటే గుండె సేఫ్!
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా కరోనా తర్వాత అందరికీ ఈ విషయం బాగా అర్థం అయింది. ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం మెయిన్. మంచి ఆహారం ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే ఆహారంలో పోషక నాణ్యతతో పాటు, తినే సమయం కూడా చాలా ముఖ్యమైనది. సమయానికి తినకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఏరికోరి కొని తెచ్చుకున్నట్లే.
కరెక్ట్ టైంకి ఆహారం తీసుకోకపోతే అది గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. రోజులో మొదటి,చివరి భోజనం ముందుగానే తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని తగ్గించవచ్చంట.

తినడానికి బెస్ట్ టైం ఇదే
బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ 103,389 మంది మీద ఫ్రాన్స్ లో ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు వారి జీవనశైలి, శారీరక శ్రమతో పాటు వారి రోజువారీ ఆహారం, పానీయాల వినియోగం గురించి కూడా వివరించారు. రోజులో మొదటి భోజనం చేసే సమయాన్ని ఆలస్యం చేసే ప్రతి అదనపు గంట CVD ప్రమాదాన్ని పెంచుతుందని ఈ అధ్యయనం తెలిపింది.
చివరి భోజనం సమయంలో ఆలస్యం అయిన ప్రతి అదనపు గంట..సెరెబ్రోవాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపింది. రాత్రి 8 గంటల ముందు భోజనం తినడం కంటే రాత్రి 9 తర్వాత చివరి భోజనం ప్రమాదాన్ని 28 శాతం పెంచుతుంది. ఉదయాన్నే బ్రేక్ పాస్ట్ ని 8 గంటల కంటే ముందు, నైట్ డిన్నర్ ని కూడా 8 గంటల లోపు తినేయడం మంచిదట.
ఈ అధ్యయనం ఆధారంగా మొదటి భోజనం సమయంలో స్థిరమైన పద్ధతిని అవలంబించాలి. చాలామంది పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరక్ట్ గా లంచ్ చేసేస్తుంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం కంటే ముందుగానే తినడం మంచిది. చివరి భోజనం, రాత్రి ఉపవాసం వ్యవధిని పెంచడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
నైట్ షిఫ్ట్ లో ఇలా
రాత్రి షిఫ్టులో పని చేస్తున్నప్పుడు ఎప్పుడు తినాలనేది అనే విషయం గురించి చాలామందిలో గందరగోళం ఉంటుంది. ఆకలి స్థాయిలు ఆహార ఎంపికలను ప్రభావితం చేస్తాయి. షిఫ్ట్ ప్రారంభానికి 2-3 గంటల ముందు సమతుల్య భోజనం తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ భోజనంలో కొంత ప్రోటీన్,ఫైబర్ ఉండాలి. ప్రోటీన్, ఫైబర్ సంతృప్తిని అందించడమే కాకుండా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.
ఎలా ఆరోగ్యంగా ఉండాలి
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, కీళ్లను ద్రవపదార్థం చేయడానికి,శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి పుష్కలంగా ద్రవాలు త్రాగాలి. మలబద్ధకాన్ని నివారించడానికి బాగా హైడ్రేటెడ్ గా ఉండటం కూడా చాలా ముఖ్యం. తక్కువ నీరు త్రాగడం ఏకాగ్రత, చురుకుదనం, స్వల్పకాలిక జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
కెఫిన్
ఈ రోజుల్లో రాత్రి షిఫ్టులలో పనిచేసే వ్యక్తులు కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఎక్కువ కెఫిన్ నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిపుణులు మీ షిఫ్ట్ ముగియడానికి నాలుగు నుండి ఎనిమిది గంటల ముందు కెఫీన్‌కు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. తద్వారా మీరు ఇంటికి వచ్చే సమయానికి కెఫిన్ ప్రభావాలు అరిగిపోతాయి, నిద్రకు అంతరాయం కలిగించవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications