Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Weight Loss Tips: బరువు తగ్గడానికి రైస్‌ను దూరం పెట్టేస్తున్నారా? ఇలా తింటే బరువు తగ్గొచ్చు!
చాలా మంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరూ సూచించేది రైస్ తినడం ఆపేసి బదులుగా ఇతర ఆహారాలు తినాలని. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు రైస్ కు బదులు ఏం తిన్నా, ఎంత తిన్నా ఆఖరికి రైస్ తినాల్సిందే. స్టార్టర్స్ ఎన్ని తిన్నా, స్నాక్స్ ఎన్ని లాగించినా ఒక్క బుక్క అయినా రైస్ తినకపోతే సంతృప్తిగా అనిపించదు.
బరువు తగ్గడానికి కొందరు అన్నం తినడం మానేసి గోధుమ, జొన్న రొట్టెలు, పండ్లు లాంటివి తినేస్తుంటారు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది. కానీ చిన్నప్పటి నుండి అలవాటైన ఆహార పదార్థాలు తినాలని నాలుక లాగేస్తుంది. అలా కంట్రోల్ తప్పిపోతారు.

మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, రైస్ తినకుండా ఉండలేకపోతే.. రైస్ ఎలా తింటే బరువు తగ్గవచ్చో తెలుసుకోవడం మంచిది. వైట్ రైస్‌ను ఎలా తింటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి రైస్ ఎలా తినాలి:
రోజూ శరీరానికి అవసరమయ్యే కేలరీల కంటే తక్కువ కేలరీలు తీసుకోవడం ద్వారా ఒంట్లోని అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గవచ్చు. రైస్ లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారి రైస్ తినకుండా దూరంగా ఉంటారు. అలాగే బియ్యంలో కొవ్వు శాతం తక్కువ, సులభంగా జీర్ణమవుతుంది, గ్లూటెన్ ఉండదు, బి విటమిన్లు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రైస్ తినడాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే తినేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
1. పోర్షన్ కంట్రోల్:
అన్నం తినేటప్పుడు ఇతర పదార్థాల నుండి వచ్చే కేలరీల సంఖ్యను తగ్గించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కేలరీల ఆహారంతో పాటు రైస్ తినడం ద్వారా బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే అన్నంతో పాటు ఇతర పిండి పదార్థాలు తినకుండా ఉండాలి.
2. కూరగాయలు తినాలి:
రైస్‌లో పిండి పదార్థాలు చాలా తక్కువ. రైస్ సులభంగా జీర్ణమై త్వరగా ఆకలి వేస్తుంది. రైస్ తినాలనుకుంటే అన్నంతో పాటు కూరగాయలు, అధిక ఫైబర్ ఉండే పదార్థాలు తినాలి. బీన్స్, బ్రొకలీ, చికెన్ బ్రెస్ట్, టర్కీ బ్రెస్ట్ లాంటివి తినాలి.
3. లో-కేలరీ వంట పద్ధతులు:
రైస్ ను వండేటప్పుడు అందులో నూనె, నెయ్యి వంటివి వేస్తారు. దీని వల్ల అన్నంతో పాటు వచ్చే కేలరీలతో పాటు నూనె, నెయ్యి వంటి ఫ్యాట్స్ కూడా వస్తాయి. అన్నం వండేటప్పుడు అలాంటివి వేయకుండా సాధారణంగా వండటం వల్ల కేలరీలను తగ్గించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications