Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Reduce Sugar Intake: చక్కెరతో అనేక రోగాలు! ఇలా తగ్గిస్తే సరి
అనేక ఆరోగ్య సమస్యలకు చక్కెరనే కారణం. బరువు పెరగడం, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్.. ఇలా చక్కెర తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చర్మ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేసే మహమ్మారి చక్కెరను తినడాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం.
శుద్ధి చేసిన తెల్లని చక్కెర వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే షుగర్ తీసుకోవడాన్ని తగ్గించాలి. రోజువారీ ఆహారం నుండి చక్కెరను ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సంపూర్ణ ఆహారాలు తినాలి:
పండ్లు, కూరగాయల్లో సహజ చక్కెర ఉంటుంది. ఈ నేచురల్ షుగర్స్ ను సులభంగా జీర్ణం చేసుకోవచ్చు. కాలేయం సహా మొత్తం శరీరం ద్వారా సులభంగా ప్రాసెస్ చేయబడతాయి. ఆర్ఠిఫిషీయల్ షుగర్ తీసుకోవడం కంటే నేచురల్ షుగర్ తీసుకోవడం చాలా మంచిది.
2. నేచురల్ స్వీటెనర్స్ మంచి ఎంపిక:
తీపిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలనుకుంటే చక్కెరకు బదులు నేచురల్ స్వీటెనర్స్ వాడటం ఉత్తమం. తేనె, మాపుల్ సిరప్, స్టెవియా వంటి స్వీటెనర్లు మంచివి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవదు.
3. ఏం తినాలో ప్లాన్ చేసుకోవాలి:
చక్కెర లేని ఆహారాలు తినడానికి ప్రయత్నించాలి. ముందుగా ఏం తినాలో ఓ ప్లాన్ వేసుకుని అందులో చక్కెర లేకుండా చూసుకోవాలి. చక్కెరకు బదులు పండ్లు తినడం చాలా మంచిది.

4. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో తెలుసుకోవాలి:
ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలుసుకుని తినాలి. తినేటప్పుడు ఆలోచించాలి. దీని వల్ల షుగర్ ను తినకుండా కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఎక్కువగా తినకుండా నియంత్రించుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యలు వంటివి తినాలి.
5. ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు:
ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదని గట్టిగా అనుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఆర్టిఫిషీయల్ స్వీటెనర్లు వాడతారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు.
6. చక్కెర పానీయాలు తాగొద్దు:
చక్కెర పానీయాలు తాగొద్దు. కార్బొనేటెడ్ వాటర్ ను కూడా నియంత్రించుకోవాలి. కూల్ డ్రింక్స్ కంటే పండ్ల రసాలు, గ్రీన్ టీ, హెర్బల్ టీ, బాదం పాలు లాంటివి తాగడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications