Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
50లోనూ పాతికేళ్ల పడుచులా మెరవడమెలా? ప్రీతి జింటా సీక్రెట్స్
ప్రస్తుతం వయస్సు, చదువు, ఉద్యోగం,వ్యాపారం,ఆదాయంతో సంబంధం లేకుండా అందరి జీవితాలు బిజీగా మారిపోతున్నాయి. ఈ బిజీ లైఫ్ లో చాలామంది తమ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఫిట్ నెస్ కూడా కోల్పోయి అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తీరికలేని పనులు, అనారోగ్యకరమైన ఆహారం, మానసిక ఒత్తిడి వంటివి మనల్ని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరం సహకరించడం మానేస్తుంది.. చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్ గా ఉండటం అనేది ఒక పెద్ద సవాలుగా మారుతుంది.
అయితే కొందరు మాత్రం వయసును కేవలం ఒక సంఖ్యగా మార్చేసి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా ముందు వరుసలో ఉంటుంది. 50 ఏళ్ల వయసులో కూడా ప్రీతి జింటా చెక్కుచెదరని అందంతో పాతికేళ్ల అమ్మాయిలా కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సానుకూల దృక్పథం ద్వారా ఆమె ఈ ఫిట్ నెస్ ను సాధించారు. కేవలం తన కోసమే కాకుండా తనలాగే 40 ఏళ్లు పైబడిన వారు కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో ఇటీవల తన ఫిట్ నెస్ రహస్యాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆమె ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

ఆహారమే ఆధారం
ఫిట్ నెస్ ప్రయాణంలో 70శాతం పాత్ర ఆహారానిదే అంటారు. ప్రీతి జింటా దీన్ని అక్షరాలా పాటిస్తారు. ఆమె తన రోజును పండ్ల రసాలతో ప్రారంభిస్తారు. ముఖ్యంగా దానిమ్మ, యాపిల్ వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. ఇంట్లో వండిన సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. తన ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకుంటారు. చక్కెర, మైదా, ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటారు.
వ్యాయామం జీవన విధానం
ప్రీతి జింటాకు ఎక్సర్ సైజ్ అనేది ఒక పని కాదు అదొక జీవన విధానం. ఆమె కేవలం ఒకే రకమైన వ్యాయామానికి పరిమితం అవ్వదు. యోగా, పైలేట్స్, కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి విభిన్నమైన వర్కవుట్స్ ని తన దినచర్యలో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కండరాల పటుత్వం తగ్గకుండా ఉండేందుకు స్ట్రెంత్ ట్రైనింగ్ పై ఎక్కువ దృష్టి పెడతారు. స్థిరత్వం చాలా ముఖ్యమని, వారంలో కనీసం 5 రోజులు వ్యాయామం చేయడం తప్పనిసరి అని ఆమె నమ్ముతారు.
మానసిక ప్రశాంతతే అసలైన బలం
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి మన అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రీతి రోజూ ధ్యానం చేయడానికి సమయం కేటాయిస్తారు. ఇది ఆమెను ప్రశాంతంగా, సానుకూలంగా ఉంచడంలో సహాయపడుతుంది. తగినంత నిద్ర, కుటుంబంతో సంతోషంగా గడపడం కూడా ఆమె ఫిట్ నెస్ రహస్యాలలో ముఖ్యమైన భాగాలు. వయసు పెరిగేకొద్దీ ఫిట్ గా ఉండటం కష్టమే కానీ అసాధ్యం కాదు. ప్రీతి జింటా నిరూపించింది ఇదే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications