Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ఆ వ్యాధికి ఈ పండే పర్ఫెక్ట్ మెడిసిన్..ఈ విధంగా తీసుకుంటే శరీరానికి వరం
సాధారణంగా ఢ్రై ఫ్రూట్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్ నట్స్,ఎండుద్రాక్షనే. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మరో అద్భుతమైన ఫలం ఉంది..అదే అంజూర పండు. దీనిని అత్తి పండు అని కూడా తెలుగువాళ్లు పిలుస్తుంటారు. ఇది కేవలం రుచిలోనే కాకుండా పోషకాలలో కూడా ఓ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ పండ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అంజీర పండ్లను పచ్చిగాను,ఢ్రై ఫ్రూట్ గా కూడా వాడుతారు. రోజూ అంజూర పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరడమే కాకుండా అనేక వ్యాధులను తరిమికొట్టవచ్చు.
జీర్ణ సమస్యలకు దివ్యౌషధం
అంజూర పండ్ల వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం జీర్ణవ్యవస్థకు సంబంధించినదే. ఈ పండులో ఉండే అధిక ఫైబర్ కడుపుకు ఒక అద్భుతమైన టానిక్ లా పనిచేస్తుంది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడేవారికి ఇది అద్భుత ఔషధం. రోజూ అంజూరాలను తినడం వల్ల మలబద్ధకం సమస్య సమూలంగా తొలగిపోతుంది..కడుపు శుభ్రపడుతుంది. ఇదే సమయంలో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాల సమాహారం
అంజూరాల ప్రయోజనాలు కేవలం జీర్ణవ్యవస్థకే పరిమితం కాదండోయ్. ఈ పండు తినడం వల్ల కలిగే మరికొన్ని ఇతర ప్రయోజనాలను ఇక్కడ చూడండి.
బరువు తగ్గడంలో సాయం: అంజీర పండులోని ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి, అనవసరమైన తిండిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
రక్తపోటు నియంత్రణ: ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును (బీపీ) నియంత్రణలో ఉంచుతుంది.
రక్తహీనతకు చెక్: ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కొత్త రక్తాన్ని అందించి, నీరసాన్ని తగ్గిస్తుంది.
ఎముకల బలం: ఈ పండులో ఉండే కాల్షియం, విటమిన్లు ఎముకలను దృఢంగా మార్చుతాయి.
ఎలా, ఎన్ని తినాలి?
అంజూరాలను నేరుగా ఎండిన రూపంలో తినడం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తినడం ఉత్తమమైన పద్ధతి. నానబెట్టిన నీటిని కూడా తాగడం వల్ల సంపూర్ణ ప్రయోజనాలు అందుతాయి. మరింత బలం కోసం, పాలలో కొన్ని అంజూరాలను వేసి మరిగించి తాగితే, శరీరం ఇనుములా దృఢంగా మారుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజుకి 2-3 అంజూరాలను తినవచ్చు. జీర్ణ సమస్యలు లేదా బలహీనత ఎక్కువగా ఉన్నవారు రోజుకు 4 వరకు తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు మాత్రం డాక్టర్ల సలహా మేరకు రోజుకు 1-2 పండ్లకు మించి తినకపోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications