Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుత ఆయుర్వేద మొక్క ఇదే!
మనకు వచ్చే దాదాపు అన్ని రోగాలకు ఈ ప్రకృతి అందించిన మెడిసెన్స్ చాలానే ఉంటాయి. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అనేక వ్యాధులకు పరిష్కారాలు మన పెరట్లోనే దొరుకుతాయి. అలాంటి ఒక అద్భుతమైన సంజీవని మొక్కే రణపాల. చూడటానికి సాధారణ ఆకుపచ్చ మొక్కలా కనిపించినా ఇందులోని ఔషధ గుణాలు అమోఘం. రణపాల మొక్క ఆకులు చాలా మందంగా, రసంతో నిండి ఉంటాయి. ఈ మొక్కను కుండీలలోనైనా, నేల మీదనైనా చాలా సులభంగా పెంచుకోవచ్చు.
కిడ్నీ రాళ్లకు దివ్యౌషధం
రణపాల ఆకులను ఆయుర్వేదంలో పాషాణభేది అని పిలుస్తారు. పాషాణం అంటే రాయి, భేది అంటే పగలగొట్టేది అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇది కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లను నెమ్మదిగా కరిగించి, ముక్కలుగా చేసి మూత్రం ద్వారా బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే తీవ్రమైన కడుపు నొప్పి నుండి ఉపశమనం అందించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున రెండు మూడు ఆకులను బాగా నమిలి తినడం లేదా వాటి రసం తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

అనేక ఇతర ప్రయోజనాలు కూడా
ఈ మొక్క ప్రయోజనాలు కేవలం కిడ్నీ రాళ్లకే పరిమితం కాదు. దీని వల్ల అనేక ఇతర ప్రయోజాలు కూడా ఉన్నాయి. 150కి పైగా వ్యాధులను ఇది నయం చేయగలుగుతుందని చెబుతారు. అందులో కొన్ని ముఖ్య ప్రయోజనాలను ఇక్కడ చూడండి.
కాలేయ ఆరోగ్యానికి మంచిది: రణపాల ఆకులలో ఉండే కొన్ని రకాల పోషకాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే కాలేయానికి సంబంధించిన సమస్యలను నివారిస్తాయి.
జీర్ణ సమస్యలకు చెక్: దీని ఆకులు పుల్లగా, ఉప్పగా ఉంటాయి. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు దీని రసంలో కొద్దిగా శొంఠి పొడి కలుపుకుని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నొప్పులు, వాపుల నివారణ: రణపాల ఆకులో సహజసిద్ధమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారు ఈ ఆకులను మెత్తగా నూరి పట్టులా వేసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. దీని ఆకులను వేడి చేసి గాయాల మీద కట్టు కడితే అవి త్వరగా నయం అవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు దీనికి సహాయపడతాయి.
రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటు ఉన్నవారికి రణపాల ఒక వరం లాంటిది. రోజూ రెండుసార్లు గ్లాసు నీటిలో కొన్ని చుక్కల రణపాల ఆకుల రసం కలుపుకుని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
రోగనిరోధక శక్తి: ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఎలా వాడాలి?
ఆకులను నేరుగా నమలడం ఇష్టం లేనివారు ఒక కషాయంలా కూడా తయారుచేసుకోవచ్చు. అర లీటరు నీటిలో 15-20 రణపాల ఆకులు వేసి ఆ నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని వడకట్టి, రోజుకు రెండుసార్లు తాగాలి. రుచి కోసం దీనికి చిటికెడు ఉప్పు లేదా తేనె కలుపుకోవచ్చు. అయితే ఒక్కొక్కరి శరీర తీరు ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్త మూలికను ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications