Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఒంటరితనం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుందా? తాజా పరిశోధనలో సంచలన విషయాలు
ఒంటరితనం వల్ల డిప్రెషన్,జీవితం మీద విరక్తి,మెంటల్,పిచ్చి ఆలోచనలు వంటివి వస్తాయని మనకు తెలిసిన విషయమే. అయితే ఒంటరితనం వల్ల షుగర్ వ్యాధి కూడా వస్తుందని మీకు తెలుసా? మన ఎమెషనల్ హెల్త్ మన శారీరక ఆరోగ్యంతో లోతుగా ముడిపడి ఉంటుంది. షుగర్ వ్యాధి గురించి ఇప్పటిదాకా మనకు తెలిసిన సమాచారం తక్కువేనని తాజాగా ఓ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందుకే మన దేశాన్ని వరల్డ్ డయాబెటిస్ రాజధానిగా కూడా పేరుపొంది.
షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే దానిని కంట్రోల్ లో ఉంచగలమే తప్ప దానిని పూర్తిగా నయం చేసే మెడిసిన్ లేదు. దీంతో ఈ వ్యాధి రాకూడదనే అందరూ కోరుకుంటారు. అయితే అనారోగ్యకరమైన జీవనశైలి,ఆహార అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల షుగర్ వస్తుందని ఇప్పటిదాకా మనం విన్నాం. అయితే జులై 12-15,2025 వరకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కో నగరంలో జరిగిన ENDO 2025(ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశం, ఇది ఎండోక్రినాలజీ పరిశోధన, క్లినికల్ కేర్‌పై దృష్టి సారించిన ఒక ప్రధాన ప్రపంచ సమావేశం)లో సమర్పించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం ఒంటరితనం మీ డయాబెటిస్ ప్రమాదాన్ని నిశ్శబ్దంగా పెంచుతుందని కనుగొంది.

వెస్ట్రన్ అంటారియో యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 50 ఏళ్లు పైబడిన 4000 మంది అమెరికన్లను అధ్యయనం చేసి ఈ సంచలన విషయాన్ని కనుగొన్నారు. సామాజికంగా దూరంగా ఉన్నట్లు భావించే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 34 శాతం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఒంటరిగా ఉన్నట్లు భావించిన, ఇప్పటికే నిర్ధారణ అయిన షుగర్ పేషెంట్లు షుగర్ కంట్రోల్ తో ఇబ్బంది పడే అవకాశం 75 శాతం ఎక్కువగా ఉంటుందట.
భావోద్వేగాల మధ్య దూరం నిద్రను ప్రభావితం చేస్తుంది, వాపును పెంచుతుంది, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, సక్రమంగా తినకపోడానికి దారితీస్తుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలపై వినాశనం కలిగిస్తాయి. ఆ అధ్యయనం ఈ ప్రభావాన్ని మరింతగా వివరించింది. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం 36 శాతం ఎక్కువగా ఉంటుంది. తరచుగా ఒంటరిగా ఉన్నవారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఒంటరితనంతో పోరాడటానికి, మీ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చిట్కాలు
కలిసి తినడం
రోజుకు ఒకసారి అయినా కుటుంబసభ్యులతో లేదా ఫ్రెండ్స్ తో లేదా సహోద్యోగులతో అయినా కలిసి తినండి. తద్వారా ఎమోషనల్ గా ఉండటాన్ని,తినడాన్ని ఇది తగ్గిస్తుంది.
పెంపుడు జంతువులు
ఇంట్లో కుక్కలు లేదా పిల్లులు వంటివి పెంచుకోవడం కూడా ఒంటరితనం తగ్గిపోతుంది. అవి మీ పక్కన ఉన్నప్పుడు అవి మీరు చెప్పింది వింటాయి,అల్లరి చేస్తాయి, మీతో కలిసి మీ పక్కనే పడుకుంటాయి..దీంతో మీకు ఒంటరితనం అనిపించదు. పక్కనే మరో వ్యక్తి ఉన్నట్లే అనిపిస్తుంది.
కాల్ చేసి కనెక్ట్ అవ్వండి
మీ మనకు దగ్గర అయిన వాళ్లతో మాట్లాడే కొన్ని క్షణాలు మీ ఆరోగ్యానికి చాలామంచిది. ఇలా చేయడం వల్ల బీపీ ట్యాబ్లెట్లు చేయలేని అద్భుతాలు చూడవచ్చు.
.
కొత్తగా ఏదైనా నేర్చుకోండి
కొత్తగా ఏదైనా నేర్చుకోడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుండటం ఉత్తమం. అది కొత్త వంటకం అయినా సరే. నైపుణ్యాలు మీ మెదడును ఉత్తేజపరుస్తాయి, మీ ఉత్సుకతను పంచుకునే ఇతరులతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications