Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? తీవ్రమైన వ్యాధికి ఇది సంకేతమా?
ఏదైనా తింటున్న సమయంలోనో లేదా మాములుగా కూర్చొని ఉన్న టైంలోనో సడెన్ గా ఎక్కిళ్లు రావడం సహజం. మనలో అందరికీ ఇలా జరుగుతుంటదది. అయితే కొన్నిసార్లు నలుగురిలో నవ్వు తెప్పించినా, మరికొన్నిసార్లు తీవ్రమైన చికాకును కలిగిస్తాయి. ముఖ్యంగా తినేటప్పుడు ఎక్కిళ్లు వస్తే ఎక్కడ గొంతులో అడ్డం పడుతుందోనన్న భయం కూడా కలుగుతుంది. అసలు ఈ ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? ఇది కేవలం ఒక చిన్న శారీరక ప్రతిచర్యేనా లేక దీని వెనుక ఏవైనా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయా?
ఎక్కిళ్ళ వెనుక సైన్స్
వైద్య నిపుణుల ప్రకారం,ఎక్కిళ్ళు రావడానికి ప్రధాన కారణం మన శరీరంలోని విభాజక పటలం(Diaphragm). ఇది మన ఛాతీని, పొట్టను వేరుచేసే ఒక పెద్ద కండరం. శ్వాస తీసుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని కారణాల వల్ల ఈ కండరం అకస్మాత్తుగా, అసంకల్పితంగా సంకోచించినప్పుడు మనం గాలిని వేగంగా లోపలికి పీల్చుకుంటాం. అయితే ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా చేరకముందే మన స్వరపేటిక వెంటనే మూసుకుపోతుంది. ఈ ప్రక్రియ వల్లే ఎక్కిళ్లు వస్తాయి.

ఎక్కిళ్ళకు దారితీసే సాధారణ కారణాలు
ఆహారపు అలవాట్లు: చాలా వేగంగా తినడం, అవసరానికి మించి తినడం లేదా ఘాటైన మసాలా పదార్థాలు తీసుకోవడం వల్ల విభాజక పటలం చికాకుకు గురవుతుంది. అలాగే కూల్ డ్రింక్స్, సోడాలు తాగినప్పుడు కడుపులో గ్యాస్ చేరి ఉబ్బి, అది విభాజక పటలంపై ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ఎక్కిళ్ళు మొదలవుతాయి.
ఉష్ణోగ్రతలో మార్పులు: వేడివేడి టీ తాగిన వెంటనే చల్లటి నీరు తాగడం వంటివి చేశారా? ఇలా ఉష్ణోగ్రతలో వచ్చే ఆకస్మిక మార్పులు విభాజక పటలానికి సంబంధించిన నరాలను ఉత్తేజపరుస్తాయి. ఇది సంకోచాలకు దారితీసి ఎక్కిళ్ళను ప్రేరేపిస్తుంది.
మానసిక ఆందోళన, ఒత్తిడి: ఆకస్మిక భయం, తీవ్రమైన ఆందోళన, ఉత్సాహం లేదా ఒత్తిడికి గురైనప్పుడు మన నాడీ వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. ఈ ప్రభావం విభాజక పటలంపై పడి అది అసాధారణంగా సంకోచించడం మొదలుపెడుతుంది. దీంతో ఎక్కిళ్ళు రావడం సహజం.
అధికంగా మద్యం సేవించడం: మద్యం ఎక్కువగా తీసుకుంటే అది కడుపులోని పొరను దెబ్బతీస్తుంది. ఈ ప్రభావం కూడా విభాజక పటలంపై పడి ఎక్కిళ్ళకు కారణమవుతుంది.
ఎప్పుడు జాగ్రత్త పడాలి?
చాలా సందర్భాలలో ఎక్కిళ్ళు కొన్ని నిమిషాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. నీళ్లు తాగినా, కాసేపు శ్వాస బిగపట్టినా ఉపశమనం లభిస్తుంది. అయితే ఎక్కిళ్ళు గంటల తరబడి లేదా రోజుల తరబడి ఆగకుండా వస్తుంటే మాత్రం..ఇది జీర్ణవ్యవస్థ సమస్యలు, నరాల బలహీనత, స్ట్రోక్ లేదా మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వంటి తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం కావచ్చు.
కాబట్టి సాధారణ ఎక్కిళ్ళకు కంగారు పడాల్సిన పనిలేదు. కానీ అవి దీర్ఘకాలం కొనసాగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకోవడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications