Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
ఆరోగ్యం అనుకుంటూ దానిమ్మ పండు తినేస్తున్నారా? ఇది తెలుసుకోకుంటే డేంజర్!
దానిమ్మ పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని, ఒంట్లో రక్తం పడుతుంది అని మనం తరచుగా వింటుంటాం. వాస్తవానికి దానిమ్మ రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఇది ఒక సూపర్ ఫుడ్. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలతో పాటు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పండును లేదా దాని రసాన్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
రక్తహీనతను తగ్గించడం, గుండెను బలంగా మార్చడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, చర్మం, జుట్టు సౌందర్యాన్ని కాపాడటంలో దానిమ్మ కీలకపాత్ర పోషిస్తుంది. అమృతం కూడా అతిగా తీసుకుంటే విషం అవుతుందన్నట్లు దానిమ్మను కూడా కొందరు వ్యక్తులు ఆచితూచి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దీనికి దూరంగా ఉండటమే మేలు. ఎవరు దానిమ్మ తినకూడదో ఇక్కడ చూడండి.

దానిమ్మను ఎవరు తినకూడదు?
తక్కువ రక్తపోటు (Low Blood Pressure) ఉన్నవాళ్లు దానిమ్మ సహజంగా రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడేవారు లేదా దానికోసం మెడిసిన్స్ వాడేవాళ్లు దానిమ్మను అధికంగా తీసుకుంటే రక్తపోటు మరింత పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్లు తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
అలర్జీలు ఉన్నవాళ్లు: కొందరికి దానిమ్మ పడకపోవచ్చు. దానిమ్మ తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దానిని తినడం ఆపేయాలి.
మధుమేహం ఉన్నవాళ్లు: దానిమ్మ పండులో సహజమైన చక్కెరలు ఉంటాయి. మితంగా తింటే ఫైబర్ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ నెమ్మదిగా కలుస్తాయి. అయితే బయట దొరికే ప్యాకేజ్డ్ దానిమ్మ రసంలో అదనపు చక్కెరలు ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు దానిమ్మను మితంగా తినడం, రసానికి బదులుగా గింజలను తినడం ఉత్తమం.
జీర్ణ సంబంధిత సమస్యలు: దానిమ్మలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా జీర్ణక్రియకు మంచిదే అయినా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.
కొన్ని రకాల మెడిసిన్స్ వాడేవాళ్లు: అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా రక్తాన్ని పల్చబరిచే మందులు వాడుతున్న వారు దానిమ్మ రసాన్ని లేదా జ్యూస్ ని తాగే ముందు డాక్టర్ ని సంప్రదించడం తప్పనిసరి. ఎందుకంటే దానిమ్మ ఆ మందుల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎవరు తప్పక తినాలి?
రక్తహీనతతో బాధపడేవారు: దానిమ్మలో ఉండే ఐరన్, ఐరన్ ను శరీరం గ్రహించడానికి సహాయపడే విటమిన్ సి ఈ రెండూ కలిసి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. రక్తహీనత సమస్యకు ఇది ఒక నేచురల్ మెడిసిన్.
గుండె ఆరోగ్యం కోరుకునేవారు: దీనిలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గర్భిణీ స్త్రీలు: గర్భంలో శిశువు ఎదుగుదలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. దానిమ్మలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. ఇది శిశువులో నాడీ సంబంధిత లోపాలు రాకుండా కాపాడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు: తరచుగా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడేవారు దానిమ్మను రోజూ తీసుకుంటే దానిలోని విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











