Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
ఓ మై గాడ్..నెయిల్ పాలిష్ అమ్మాయిలకు షాకింగ్..
రంగురంగుల నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలామంది మహిళలకు అదొక సరదా. అది కేవలం అందాన్ని పెంచడమే కాకుండా మన ఫ్యాషన్ అభిరుచిని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. చేతివేళ్లకు మెరిసే రంగులు అద్దుకున్నప్పుడు కలిగే ఆనందమే వేరు. అయితే ఒక నెయిల్ పాలిష్ ఆరిపోకముందే మరొకటి వేస్తూ, మీ గోళ్లకు ఊపిరి ఆడనివ్వకపోతే వాటి పరిస్థితి ఏంటి? నిరంతరం నెయిల్ పాలిష్ వాడటం వల్ల మన గోళ్లు సహజమైన అందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతాయి. నెయిల్ పాలిష్ లో ఉండే రసాయనాలు మన గోళ్లను బలహీనపరచడమే కాకుండా వాటిని పొడిబారేలా చేసి, పగుళ్లకు దారితీస్తాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతాయి.
యూరప్ లో నిషేధం
ఈ మధ్యకాలంలో యూరప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నో జెల్ నెయిల్ పాలిష్ బ్రాండ్ లలో ఉపయోగించే ట్రైమెథైల్బెంజాయిల్ డైఫెనిల్ ఫాస్ఫైన్ ఆక్సైడ్ (TPO) అనే రసాయనాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ రసాయనం మానవ పునరుత్పత్తి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుందని పరిశోధనల్లో తేలింది. సెప్టెంబర్ 1, 2025 నుండి ఈ నిషేధం కఠినంగా అమలులోకి వచ్చింది. దీని ప్రకారం యూరప్ లోని ఏ కంపెనీ కూడా TPO ఉన్న నెయిల్ పాలిష్ లను అమ్మడానికి, దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. సెలూన్ లు కూడా తమ పాత స్టాక్ ను తొలగించి, TPO రహిత ప్రొడక్టులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. TPO కేవలం పునరుత్పత్తి సమస్యలనే కాకుండా స్కిన్ అలెర్జీలు, సెన్సిటైజేషన్ కు కూడా కారణమవుతుందని, దీనిని క్యాన్సర్ కారకంగా కూడా వర్గీకరించారు.

నెయిల్ పాలిష్ లో దాగి ఉన్న ఇతర శత్రువులు
TPO మాత్రమే కాకుండా సాధారణ నెయిల్ పాలిష్ లలో మన ఆరోగ్యానికి హాని కలిగించే మరిన్ని విషపూరిత పదార్థాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఇప్పుడు చూద్దాం.
ఫార్మాల్డిహైడ్: ఇది గోళ్లను గట్టిపరచడానికి వాడతారు..కానీ ఇది తీవ్రమైన చర్మపు చికాకు, అలెర్జీ రియాక్షన్లకు కారణమవుతుంది.
టోలుయెన్: ఇది నెయిల్ పాలిష్ సులభంగా అతకడానికి సహాయపడుతుంది, కానీ దీని ఆవిర్లు పీల్చడం వల్ల తలతిరగడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
డైబ్యూటిల్ థాలేట్ (DBP): ఇది పాలిష్ పగిలిపోకుండా కాపాడుతుంది కానీ ఇది పునరుత్పత్తి వ్యవస్థకు అత్యంత హానికరం.
ఈ రసాయనాలకు రోజూ గురికావడం వల్ల మన ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రభావం పడుతుంది. నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు దాని వాసనను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

పరిష్కారం ఏమిటి?
అందంగా కనిపించడం ముఖ్యమే కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాదు. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, మీ గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రతిరోజూ కాకుండా వారంలో కొన్ని రోజులు లేదా నెలలో ఒక వారం పాటు మీ గోళ్లకు విశ్రాంతినివ్వండి. ఇది గోళ్లు సహజంగా ఊపిరి పీల్చుకోవడానికి, కోలుకోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా నెయిల్ పాలిష్ కొనేటప్పుడు బాటిల్‌పై 3-ఫ్రీ లేదా 5-ఫ్రీ అనే లేబుల్స్ ఉన్నాయో లేదో చూడండి. అంటే హానికరమైన రసాయనాలు లేకుండా తయారు చేయబడినవని అర్థం.
మీ గోళ్లను, క్యూటికల్స్‌ను తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా క్యూటికల్ ఆయిల్‌తో మసాజ్ చేయండి. అసిటోన్ రహిత రిమూవర్లు వాడండి..అసిటోన్ గోళ్లలోని సహజ నూనెలను తొలగించి, వాటిని పొడిగా చేస్తుంది. నెయిల్ పాలిష్ వేసే ముందు, ఎల్లప్పుడూ ఒక ప్రొటెక్టివ్ బేస్ కోట్ వేయండి. ఇది మీ గోళ్లపై మరకలు పడకుండా కాపాడుతుంది, రసాయనాల నుండి ఒక పొరలా రక్షిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications