Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుడ్డు ఉడికించి తినాలా? వేయించి తినాలా?..ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా..
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి గుడ్లను తీసుకునేటోళ్లు చాలామందే ఉంటారు. రోజుకు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు కూడా చెబుతుంటారు. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన విటమిన్లు A, D, B12, ఇనుము వంటి కీలక పోషకాలతో నిండిన గుడ్డును రోజూ ఉదయం ఆహారంలో చేర్చుకుంటే, మీ శరీరానికి రోజంతా అవసరమయ్యే శక్తి లభిస్తుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుడ్లను కొందరు ఆమ్లెట్ రూపంలో మరికొందరు ఉడికించి తీసుకుంటారు.
అయితే, ఇక్కడే మనందరి మదిలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. గుడ్డును ఎలా తింటే దాని పూర్తి ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి? ఉడికించిన గుడ్లు మంచివా లేక వేయించిన గుడ్లు ఉత్తమమా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కేవలం వండే విధానంలోనే కాదు, అవి మన ఆరోగ్యంపై చూపించే ప్రభావంలో కూడా ఉంది. ఈ రెండు పద్ధతులకు వాటివాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు ఉన్నాయి.

ఉడికించిన గుడ్డు
ఉడికించిన గుడ్డు అంటే స్వచ్ఛమైన ఆరోగ్యం. దీని తయారీలో నూనె వంటి అదనపు పదార్థాల అవసరం ఉండదు. ఫలితంగా ఎలాంటి అదనపు కొవ్వులు, క్యాలరీలు శరీరంలోకి చేరవు. బరువు తగ్గాలనుకునే వారికి, ఆహార నియంత్రణ పాటించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఉడికించే ప్రక్రియలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండటం వల్ల గుడ్డులోని సున్నితమైన పోషకాలైన విటమిన్ B12, కోలిన్ వంటివి నశించిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా మెత్తగా ఉడికించిన గుడ్డు జీర్ణం కావడం చాలా సులభం. పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా దీనిని సౌకర్యవంతంగా తినవచ్చు. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు ఉడికించిన గుడ్డు ఫర్ఫెక్ట్.
వేయించిన గుడ్డు
వేయించిన గుడ్డు పేరు వినగానే మనకు నోరూరించే రుచి, కరకరలాడే అంచులు గుర్తుకొస్తాయి. నూనెలో వేయించడం వల్ల గుడ్డుకు ఒక ప్రత్యేకమైన రుచి, ఆకృతి వస్తుంది. అయితే నూనె అనగానే చాలామంది భయపడతారు. కానీ అన్ని నూనెలు చెడ్డవి కావు. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, లేదా పొద్దుతిరుగుడు నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలను వాడితే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కఠినమైన వ్యాయామాలు చేసేవారికి, కండరాల నిర్మాణానికి అధిక ప్రోటీన్ అవసరమైన వారికి వేయించిన గుడ్డు మంచి శక్తిని అందిస్తుంది. అయితే నూనెను పీల్చుకోవడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి కాబట్టి, బరువు నియంత్రణలో ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవడం మంచిది.
ఏ గుడ్డు మంచిది?
ఈ ప్రశ్నకు సమాధానం మీ జీవనశైలి, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
-మీ లక్ష్యం బరువు తగ్గడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అయితే ఉడికించిన గుడ్లు మీకు కరెక్ట్.
-మీరు రుచికి ప్రాధాన్యత ఇస్తూ, వ్యాయామం ద్వారా శక్తిని కోల్పోతుంటే, ఆరోగ్యకరమైన నూనెతో చేసిన వేయించిన గుడ్డును అప్పుడప్పుడు తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications