Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మగాళ్లు ఈ 4 తింటే సంతానలేమి సమస్యే ఉండదు..స్పెర్మ్ కౌంట్ భారీగా పెరుగుతుందట
ఈ కంప్యూటర్ కాలంలో మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి, పని ఒత్తిడి వంటి కారణాలతో మగవాళ్లు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో అత్యంత ముఖ్యమైనది,చాలామంది మగవాళ్లను కుంగదీసేది సంతానలేమి సమస్య. దీనికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ తగ్గుదల, పేలవమైన స్పెర్మ్ చలనశీలత (వీర్యకణాల కదలిక) . దీంతో చాలామంది పెళ్లైన మగాళ్లు పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య కారణంగా హాస్పిటల్స్ చుట్టూ లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు. ఇక జీవితంలో తండ్రిని కాలేను అని చాలామంది మగాళ్లు కుమిలిపోతున్నారు.
స్పెర్మ్ కంట్ అంటే..ఒక మిల్లీలీటర్ వీర్యంలో ఉండే కణాల సంఖ్య. స్పెర్మ్ చలనశీలత అంటే.. ఆ కణాలు అండం వైపు ఈదుకుంటూ వెళ్లే సామర్థ్యం. ఈ రెండూ సరైన స్థాయిలో ఉన్నప్పుడే ఫలదీకరణ ప్రక్రియ విజయవంతమై, గర్భధారణకు అవకాశం ఉంటుంది. చాలా జంటలు ఈ సమస్య కారణంగానే తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. అయితే ఈ సమస్యకు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకునే కన్నా ఇంట్లోనే దీనికి సులభమైన పరిష్కారం ఉందని తమిళనాడుకు చెందిన ప్రముఖ డాక్టర్ ఐజాక్ అబ్బాస్ చెబతున్నారు. మన వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలతోనే పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరచుకోవచ్చని డాక్టర్ ఐజాక్ అబ్బాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఆయన సూచించిన ఆ ఆహార పదార్థాలు ఏవో ఇక్కడ చూడండి.

చేపలు..ఒమేగా-3 నిధి
మీరు నాన్ వెజ్ తినేటోళ్లు కనుక అయితే చికెన్, మటన్ ల కన్నా చేపలు తినడం ఉత్తమం. చేపలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యకరమైన వీర్యకణాల అభివృద్ధికి అత్యంత అవసరం. ఇవి స్పెర్మ్ కణాల నిర్మాణాన్ని, నాణ్యతను మెరుగుపరుస్తాయి. సంతాన సమస్యలను నివారించాలనుకుంటే వారానికి కనీసం రెండుసార్లు మీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం మేలు చేస్తుంది.
వెల్లుల్లి
మన భారతీయ వంటగదుల్లో ఏది ఉన్నా లేకుండా వెలుల్లి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూరలకు మరో లెవల్ టేస్ట్ ని అందిస్తుంది. అయితే ఘాటైన వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని దూరం పెడతారు. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం పురుషాంగానికి రక్త ప్రసరణను మెరుగుపరిచి, వీర్యకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే, ఇందులో ఉండే సెలీనియం అనే ఖనిజం వీర్యకణాల చలనశీలతను, వేగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గొడ్డు మాంసం (బీఫ్)
గొడ్డు మాంసంలో కార్నిటైన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర కణాలను ఆక్సీకరణ నష్టం నుండి కాపాడుతుంది. ఈ నష్టం పురుషులు, స్త్రీలలో వంధ్యత్వానికి ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా, గొడ్డు మాంసం కాలేయంలో ఉండే 'కోఎంజైమ్ Q10' వీర్యకణాల ఆకృతి దెబ్బతినకుండా చూస్తుంది.

టమాటో
తక్కువ రేటులో లభిస్తూ కూరలకు రుచికి,మనకు ఆరోగ్యాన్ని అందించే టమాటో సంతానలేమి సమస్యలతో బాధపడే పురుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం. వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ బి, విటమిన్ సి కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇందులో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వీర్యకణాలలోని జన్యుపదార్థం (DNA) దెబ్బతినకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఆహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి
పైన చెప్పిన ఆహారాలను తీసుకోవడంతో పాటు రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యమని డాక్టర్ ఐజాక్ అబ్బాస్ నొక్కి చెబుతున్నారు. వ్యాయామం ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరిచి మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
