Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
బ్రోకలీ vs కాలీఫ్లవర్..ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మనం తరచుగా మన ఇళ్లలో కాలిఫ్లవర్, బ్రోకలితో తయారుచేసిన వంటకాలను తింటుంటాం. వీటిని కూరలుగా చేయడం మాత్రమే కాకుండా స్నాక్స్ గా లేదా సలాడ్స్ తో తినడానికి కూడా ఉపయోగిస్తుంటాం. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే అని తరుచుగా వింటుంటాం. అయితే ఇవి కేవలం రుచికే గాక పోషకాల గని. ఇమ్యూనిటీ పెంచడంలో, శరీరంలో వాపులను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతుంటారు. వారంలో ఒక్కసారైనా వీటిని ఆహారంగా తీపుకోవడం వల్ల మహిళలలో పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే బ్రోకలి, కాలిఫ్లవర్ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది? వాటిని వండుకునే సరైన పద్ధతి ఏది?
బ్రోకలి ప్రయోజనాలివే
ఒక కప్పు పచ్చి బ్రోకలీలో దాదాపు 30 కేలరీలు, 2 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. బ్రోకలీలో విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తికి ఒక కవచంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ K, కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలోని వాపులను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి, మలబద్ధకం సమస్య దూరమవుతుంది

కాలీఫ్లవర్ ప్రయోజనాలివే
ఒక కప్పు పచ్చి కాలీఫ్లవర్‌లో దాదాపు 27 కేలరీలు, 2 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. కాలీఫ్లవర్‌లో కూడా విటమిన్ C, విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ప్రత్యేకత కోలిన్. ఇది మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తికి, కండరాల కదలికలకు చాలా అవసరం. కాలీఫ్లవర్‌లో కూడా సల్ఫోరాఫేన్ ఉంటుంది, ఇది రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని పరిశోధనలు గుర్తించాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెటర్ ఆప్షన్.
ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది?
రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే మీ అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. మీకు విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా కావాలంటే బ్రోకలీ బెటర్ ఛాయిస్. అదే మీరు తక్కువ కేలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలనుకుంటే కాలీఫ్లవర్ సరైనది. రెండింటినీ మీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమైన మార్గం.

వండే సరైన పద్ధతి
ఈ కూరగాయలపై ఉండే పురుగుమందులు, రసాయనాలను తొలగించడానికి వండే ముందు బ్లాంచింగ్ చేయడం మంచిది.
బ్రోకలీ లేదా కాలీఫ్లవర్ పువ్వులను విడదీసి శుభ్రంగా కడగాలి.
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి.
నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ పువ్వులను అందులో వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచాలి.
వెంటనే వాటిని తీసి చల్లని ఐస్ నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల అవి మరీ మెత్తబడకుండా వాటి రంగు కోల్పోకుండా ఉంటాయి.
ఇప్పుడు ఈ కూరగాయలు సూప్, సలాడ్, ఫ్రై లేదా కూర వండుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications