Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఆరోగ్యానికి అమృతం: బుల్లెట్ ప్రూఫ్ కాఫీ..3 నెలలు తాగితే జరిగే అద్భుతాలివే
ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదా ఘీ కాఫీ అనే పేరు బాగా వినిపిస్తోంది. ఉదయాన్నే బ్లాక్ కాఫీలో కొద్దిగా నెయ్యి కలుపుకుని తాగడమే ఈ కొత్త ట్రెండ్. ఇది రోజంతా అద్భుతమైన శక్తిని ఇవ్వడమే కాకుండా బరువు తగ్గడానికి, ఏకాగ్రతను పెంచడానికి కూడా సహాయపడుతుందని బలంగా నమ్ముతున్నారు. మూడు నెలల పాటు ఈ నెయ్యి కాఫీని తాగితే మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.
నెయ్యి కాఫీతో ప్రయోజనాలేంటి?
నిపుణుల ప్రకారం..నెయ్యిలో మన శరీరానికి అవసరమైన మంచి కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA), బ్యూటిరేట్ అనేవి ఇందులో ప్రధానమైనవి. CLA శరీరంలోని కొవ్వును కరిగించి బరువును నియంత్రణలో ఉంచితే, బ్యూటిరేట్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి పేగులను బలోపేతం చేస్తుంది.
కాఫీలోని కెఫీన్, నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కలిసినప్పుడు రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది. కెఫీన్ తాగిన వెంటనే మెదడును చురుగ్గా మార్చి తక్షణ శక్తిని ఇస్తుంది. అదే సమయంలో నెయ్యిలోని కొవ్వులు శక్తిని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. దీనివల్ల ఎక్కువసేపటి దాకా అలసట లేకుండా ఎనర్జీతో ఉంటారు. ఈ కలయిక జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును మరింత సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది శక్తిని, ఏకాగ్రతను పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

దుష్ప్రభావాలు కూడా..
నెయ్యి కాఫీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని తీవ్రమైన నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెయ్యిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలని దీనిని పరిమితికి మించి తీసుకుంటే బరువు తగ్గడానికి బదులుగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. శరీరంలో అధిక క్యాలరీలు చేరడం వల్ల కొవ్వు పేరుకుపోయి ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..నెయ్యిలో సంతృప్త కొవ్వు (Saturated Fat) ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. ఈ కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో పూడికలుగా ఏర్పడి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎవరు దూరంగా ఉండాలి?
నిపుణురాల ప్రకారం..అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు,అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవాళ్లు నెయ్యి కాఫీకి దూరంగా ఉండటం మంచిది. ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా దీనికి దూరంగా ఉండటం బెటర్ అని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications