Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
శరీరం లోపల జరిగే కొన్ని మార్పులు మనకు వెంటనే సంకేతాల ద్వారా తెలుస్తాయి. అయితే వాటిని సకాలంలో గుర్తించకపోతే చాలా ప్రమాదం. అందులో ఒకటి మూత్రంలో మంట. యూరిన్ తక్కువగా లేదా చాలా ఎక్కువగా రావడం, రంగులో తేడా ఇలా రకాల మార్పులు కనిపిస్తాయి. ఇక ఈ సమస్యతో పాటు పొత్తి కడుపులో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే అవి మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌కి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమస్యని ఎలా నివారించాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..

మన ఆరోగ్యం మెరుగ్గా ఉందనడానికి శరీరం చాలా రకాల సంకేతాలనిస్తుంది. యాక్టివ్‌గా పనిచేయడం, ఎనర్జీ లెవెల్స్, మూత్ర విసర్జన, హైడ్రేషన్ ఇలా కొన్ని లక్షణాలతో మనం హెల్తీగా ఉన్నామని చెప్పవచ్చు. అయితే వీటిలో ఏ ఒక్క సమస్య తలెత్తినా బాధలు తప్పవు. ముఖఅయంగా మూత్ర విసర్జన అనేది మనం ఎంత హెల్తీగా ఉన్నామో చెబుతుంది. అయితే యూరిన్ సమయంలో మంటగా అనిపిస్తే చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఇది చిన్న సమస్య కాదు. కొన్నిసార్లు దీనికి డీహైడ్రేషన్‌కి కారణం కావచ్చు. అయితే మంటతో పాటు తరచూ యూరిన్‌కి వెళ్లాలని అనిపించడం, పొత్తి కడుపులో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం దానిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్(UTI)కి సంకేతం కావచ్చని నిపుణులు అంటున్నారు.

అయితే యూరినరీ ఇన్‌ఫెక్షన్ సమస్య అనేది మహిళల్లో తరచుగా కనిపిస్తుంది. అప్పుడప్పుడూ పురుషులకి కూడా రావచ్చు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలను పట్టించుకోకపోయినా, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోయినా అది భవిష్యత్తులో కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించడం ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే మూత్రనాళం, మూత్రాశయం లేదా కిడ్నీల్లోని ఏ భాగానికైనా సోకి ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తుంది. అందుకే మీకు యూరిన్ సాఫీగా, మంట లేకుండా రాకపోతే దానిని సాధారణంగా కొట్టిపారేయకూడదు.

ఇక, పురుషులతో మహిళల్లో యూరినరీ ఇన్‌ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉండటం వల్ల బ్యాక్టీరియా త్వరగా మూత్రాశయంలోకి చేరుకుంది. ఇది ఇన్‌ఫెక్షన్‌కి దారి తీసి మూత్రంలో మంట, తరచుగా వెళ్లాల్సి రావడం, పొత్తి కడుపులో నొప్పికి దారితీస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో చలి జ్వరం కూడా రావచ్చు.
ఇన్‌ఫెక్షన్ ఏ సందర్భాల్లో రావచ్చు
శారీరక కలయిక సమయంలో స్త్రీపురుషులు పరిశుభ్రత పాటించకపోతే యూరిన్ ఇన్‌ఫెక్షన్ సోకవచ్చు. ఇంకా పీరియడ్స్ తర్వాత, మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గితే మహిళల్లో ఈ ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారిలో, డయాబెటిస్ బాధితుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్య తీవ్రమైనప్పుడు ఇంటి చికిత్సలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. బాడీ డీహైడ్రేషన్‌కి గురికాకుండా తరచుగా నీరు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా ఉన్నా తరచుగా నీళ్లు తాగడం ద్వారా యూరిన్‌తో బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే బాత్‌రూమ్‌కి వెళ్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. ఇంకా డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడవచ్చు. ఇన్‌ఫెక్షన్‌తో పాటు జ్వరం, చలి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications