Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
ఆన్‌లైన్‌లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.!
ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ఒక్క క్లిక్‌తో అన్నీ ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతి వస్తువును సులభంగా ఆర్డర్ చేసుకోగలుగుతున్నాం. సరుకులు, నిత్యావసరాలు, మందులు, బ్యూటీ యాక్సెసరీస్ ఇలా ఒక్కటేమిటి ప్రతి వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నాం. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తున్నాం. మరి ఈ ఆభరణాలు సరైనవేనా.. అని ఆలోచిస్తే వీటి ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే అనేక ఆభరణాల్లో అధిక స్థాయిలో ప్రమాదకర లోహాలు ఉంటున్నాయని.. వీటి ద్వారా మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని యూకేకి చెందిన శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ఫ్యాషన్ కోసం మనం ప్రతిరోజూ ధరించే ఈ ఆభరణాల్లో అనారోగ్య కారకాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆందోళన తలెత్తింది.
ఆరోగ్య సమస్యలు
ఆన్‌లైన్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే కొన్ని ఆభరణాలు ఉంగరాలు, చెవిపోగులు, లాకెట్లు, హారాలు, గొలుసులు వంటి వాటి తయారీలో అత్యంత ప్రమాదకరమైన కాడ్మియం లోహం ఉన్నట్లు వైద్య పరిశోధనలో వెల్లడైందని బ్రిటన్‌కి చెందిన మీడియా సంస్థ సండే టైమ్స్ నివేదించింది. ఇది కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని దీర్ఘకాలం పాటు వాడటం ద్వారా ఎముకలు బలహీనం కావడం, క్యాన్సర్ ప్రమాదంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కాడ్మియం శరీరానికి సంబంధించి అత్యంత విషపూరితమైన లోహాలలో ఒకటి. అందుకే సాధ్యమైనంత వరకు ఈ లోహానికి దూరంగా ఉండాలి.

అతివలు తమ ఫ్యాషన్ వస్త్రధారణలో భాగంగా వివిధ రకాల ఆభరణాలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులో భాగంగా ఆన్‌లైన్‌లో ఆఫర్ల పుణ్యమా అని తక్కువ ధరలో ఉన్న వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఈ చవకైన ఫ్యాషన్ నగలలో ఇతర లోహాలకు ప్రత్యామ్నాయంగా బరువు, లుక్ బాగుండేలా, మెరిసేలా చేయడానికి కాడ్మియంను ఉపయోగిస్తారు. అయితే నగల తయారీలో సీసం అనుమతి 0.01 శాతానికి మించకూడదు. అంతకు మించితే శరీరంపై దుష్ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌కి చెందిన మీడియా సంస్థ ది సండే టైమ్స్ జరిపిన దర్యాప్తులో ఈ నగలలో అనుమతించిన దాని కంటే దాదాపు 9,000 రెట్లు ఎక్కువ హానికరమైన లోహాలు ఉన్నాయని తేలింది.
పరిమితికి మించి కాడ్మియం
ఉదాహరణకి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఒక ఉంగరాన్ని 925 వెండితో, అంటే 92.5% వెండితో తయారు చేసినట్లు ధ్రువీకరిస్తారు. కానీ వీటిని పరీక్షిస్తే పరిమితి కంటే దాదాపు 9,000 రెట్లు ఎక్కువ కాడ్మియం ఉన్నట్లు వెల్లడైంది. అంటే ఆ ఉంగరంలో 92 శాతానికి పైగా కాడ్మియం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలోనూ నగలను టెస్ట్ చేయగా ఇదే రుజువైంది. ఇలాంటి ఆభరణాలు ధరించేవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా, గత రెండేళ్లుగా బ్రిటన్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అనుమానిస్తున్న ఉత్పత్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దీంతో కాడ్మియం వాడకంపై పరిమితులు, నిషేధం విధించారు. ఈ ఆభరణాలతో ప్రజలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని దర్యాప్తులో తేలడంతో వాటిని ఆన్‌లైన్ అమ్మకాల నుంచి వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చెవి పోగుల వల్ల ప్రమాదం
ఆన్‌లైన్‌లో విక్రయించే చెవి పోగులతో ఇంకా ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. చెవి కుట్టించుకున్న చోట నేరుగా చర్మాన్ని తాకడంతో ఆ లోహం శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు పిల్లలు వీటిని నోట్లో పెట్టుకున్నా, నమిలినా, మింగినా తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications