Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శరీరానికి కాల్షియం ఎప్పుడు అవసరం? ఉదయమా లేక సాయంత్రమా?
మన ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అనేది అవసరం అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. వాస్తవానికి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం ముఖ్యమైన మినరల్. మన శరీరంలో నిల్వ ఉండే మొత్తం కాల్షియంలో 99శాతం ఎముకలు,దంతాల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కాల్షియం ప్రాముఖ్యత కేవలం ఎముకలకే పరిమితం కాదండోయ్.. కండరాల సంకోచానికి, నరాల సంకేతాల పనితీరుని కూడా మెరుగుపరటానికి కాల్షియం అవసరం.
అనేక రకాల హార్మోన్లు, ఎంజైమ్స్ కార్యకలాపాలకు, మనకు ఎక్కడైనా గాయమైనప్పుడు రక్తం ఆగడానికి జరిగే ప్రక్రియలో కాల్షియం ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది కాల్షియం లోపాన్ని అధిగమించడానికి ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. అయితే వాటిని ఏ సమయంలో తీసుకోవాలో చాలా మందికి సరైన అవగాహన ఉండదు.

సమయం ఎందుకు ముఖ్యం?
ఎముకలు కాల్షియంను సమర్థవంతంగా గ్రహించడానికి సరైన సమయం చాలా ముఖ్యం. కొన్ని సమయాల్లో మనం తీసుకున్న కాల్షియం సరిగ్గా శోషించబడకుండానే జీర్ణవ్యవస్థ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మన శరీరం ఒకేసారి 500-600 మి.గ్రా కంటే ఎక్కువ కాల్షియంను గ్రహించలేదు కాబట్టి మీరు భోజనం తర్వాత వెంటనే 1000 mg కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటే అందులో దాదాపు సగం వృధా అయ్యే అవకాశం ఉంది. అందుకే కేవలం మోతాదుపై మాత్రమే దృష్టి పెట్టడమే కాకుండా ఎప్పుడు తీసుకుంటున్నాం అనే దానిపై కూడా శ్రద్ధ వహించడం చాలా అవసరం.
ఉదయం సమయం సరైనదేనా?
చాలా మంది ఉదయం భోజనంతో పాటు కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకుంటారు. ముఖ్యంగా కాల్షియంతో పాటు ఇతర విటమిన్లు కూడా ఉండే మల్టీవిటమిన్లను ఉదయం వేసుకునేవారు ఎక్కువ. అయితే ఈ ఉదయం సమయం అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ ఉదయపు ఆహారపు అలవాట్లు కాల్షియం శోషణకు ఆటంకం కలిగించవచ్చు. కాల్షియం ఇతర పోషకాలతో ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, జింక్ తో పోటీపడుతుంది. మీరు కాల్షియం మాత్రలు, మల్టీ మినరల్ ట్యాబ్లెట్లు ఒకేసారి తీసుకుంటే అవి మీ కడుపులో ఒకదానితో ఒకటి పోటీపడటం ప్రారంభిస్తాయి. దీనివల్ల ఏ ఒక్క మినరల్ కూడా సరిగ్గా శోషించబడకపోవచ్చు. కాబట్టి మీరు ఐరన్ లేదా జింక్ ట్యాబ్లెట్లు తీసుకుంటుంటే వాటికి కనీసం రెండు గంటల ముందు లేదా తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
చాలా మంది పొద్దున్నే లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మీరు ఉదయం కాల్షియం తీసుకోవాలనుకుంటే కాఫీ లేదా టీ తాగడానికి కనీసం ఒక గంట ముందు తీసుకోవడం మంచిది. అయితే చాలా మంది పగటిపూట కూడా అప్పుడప్పుడు టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. కాబట్టి ఉదయం కాల్షియం ట్యాబ్లెట్లను తీసుకోవడం అంత మంచి ఆలోచన కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి సమయం అనుకూలంగా ఉంటుందా?
కొన్ని అధ్యయనాలు రాత్రిపూట కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఎముకల పునరుత్పత్తి మెరుగుపడుతుందని సూచిస్తున్నాయి. మనం నిద్రపోతున్న సమయంలో ఎముకలు వాటిని అవే చాలా యాక్టివ్ గా రిపేర్ చేసుకుంటాయి. ఈ సమయంలో శరీరానికి కాల్షియం ఎక్కువగా అవసరం అవుతుంది. మన శరీరం రాత్రిపూట సహజంగానే రక్తప్రవాహం నుండి కాల్షియంను ఎముకల్లోకి లాగుతుంది. కాబట్టి ఈ సమయంలో కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల అది నేరుగా ఎముకలకు చేరే అవకాశం ఉంది. ఇది కాల్షియం శోషణను పెంచడానికి సహాయపడుతుంది. అయితే మీ ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న ఇతర పోషకాలను పరిగణనలోకి తీసుకుని ఒక వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications