Latest Updates
-
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ఇటీవలి కాలంలో చాలా మంది తరచుగా మైగ్రేన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే దీనిని ఒక సాధారణ తలనొప్పిగా కొట్టిపారేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైగ్రేన్ కారణంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఓ అధ్యయనంలో తేలిందని వెల్లడిస్తున్నారు. అసలు తలనొప్పికి, గుండె ఆరోగ్యానికి సంబంధమేంటి.? ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. కార్డియాలజిస్టులు ఏం చెబుతున్నారు.. ఇక్కడ చూద్దాం..

మైగ్రేన్ అనేది ఒక రకమైన అసాధారణ తీవ్రమైన తలనొప్పి. ఇది సాధారణ తలనొప్పిలా కాసేపటికి తగ్గిపోదు. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారు వికారం, వాంతులతో సతమతమవడం, లైటింగ్, చిన్న శబ్దాలను సైతం తట్టుకోలేకపోవడం వంటి వాటిని ఎదుర్కొంటారు. ఇలాంటి సున్నితమైన సమస్యలతో వారి రోజువారీ జీవితం ప్రభావితం కావడంతో పాటు వృత్తిపరమైన జీవితంపైనా ప్రభావం పడుతుంది. కొందరిలో అప్పుడప్పుడూ ఈ సమస్య కనిపిస్తుండగా.. మరికొందరిలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ మైగ్రేన్ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని కార్డియాలజిస్ట్ నిపుణులు చెబుతున్నారు.
మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు, కరోనరీ హార్ట్ డిసీజ్, ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం తలనొప్పి మాత్రమే కాదని.. ఇది గుండే, రక్తనాళాల ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే 45 ఏళ్ల లోపు మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోందని అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. మరోవైపు ఊబకాయం, ధూమపానం, అధిక రక్తపోటు, మైగ్రేన్‌తో పాటు పలు గుండె సంబంధిత వ్యాధులు సైతం గుండె జబ్బులకి కారకాలుగా నిలుస్తున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో తరచుగా మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కార్డియాలజిస్ట్ నిపుణులు సూచిస్తున్నారు. సడెన్‌గా తలనొప్పి తీవ్రంగా మారినా.. గతంలో ఇలాంటి సమస్యలు రానప్పుడు, మాట్లాడుతుంటే ఇబ్బంది, మీ బాడీలో ఏ పార్ట్ అయినా బలహీనంగా అనిపించడం, తల తిరగడం, దృష్టి లోపం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు ఎదుర్కొన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ముందుగానే వ్యాధి నిర్ధారణ వల్ల తీవ్రమైన సమస్యలు గుర్తించవచ్చని సలహా ఇస్తున్నారు.
తరచుగా మైగ్రేన్ సమస్య వేధిస్తున్న వారు తమ జీవనశైలిలో ఇవి మిస్ అవుతున్నాయోమో గమనించుకోవాలి. తగినంత నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, భోజన వేళల్లో మార్పులు, సరైన తిండి లేకపోవడం వంటి మైగ్రేన్‌కి దారి తీస్తాయి. పుష్కలంగా నీరు తాగుతూ, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం ద్వారా మైగ్రేన్ సమస్య నుంచి నిదానంగా బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications