పగటి కలలు నిజమౌతాయా.. కలలపై నిపుణులు ఏమంటున్నారు..?

కలలు నిజం కావు. అదంతా ఓ భ్రమలా కొనసాగిపోతుంది. కాని కొన్ని కలలు నిజం అవుతాయంటారు. నిద్రలో ఉండి కనే కలలు ఉంటాయ్. మేలుకవలో పనిచేస్తే కలలు ఉంటాయ్. సాధారణంగా పగటి కలలు నిజం అవుతాయంటారు. కానీ మనము మన జీవితంలో కొన్ని సాధించాలని కలలు కంటాము. కష్టపడితే వాటిలో కొన్ని నిజం అవుతాయ్. అలాంటి కలలని కూడా పగటి కలలుగా అనుకోవచ్చు. కానీ నిద్రలో వచ్చే కలల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Meaning of dreams interpreting dreams do morning dreams become true

కలలను బట్టి మనసు స్థితి. మన జీవితంలోని ప్రధానాంశాలకు ఏమైనా సంబంధం ఉన్నదా.? నిద్రలో వచ్చే కలల నుంచి మనము ఏమైనా నేర్చుకోవచ్చా లేదా అనే విషయాలను ఈ ఆర్టికల‌లో మీకోసం అందిస్తున్నాం.

కలలపై సైన్స్ ఏం చెబుతోంది..?

కలలు చాలా సాధారణం. రోజంతా పనిలో ఉండి నిద్రలోకి జారుకున్న తురవాత. ఆ రోజు జరిగిన పనులన్నింటినీ మెదడు తీసుకొని వాటన్నింటికీ ప్రతిరూపంగా కలగా మనముందుంచుతుంది. కలలు వచ్చే సమయంలో కళ్లు వేగంగా అటు ఇటు తిరుగుతుంటాయి. కలలలో ముఖ్యంగా మన కోరికలు, భయాలు, పరిష్కారం కాని గొడవలు కనిపిస్తాయ్.

కలలలో వచ్చే గుర్తులు వాటి అర్థాలు

మనకు వచ్చే చాలా కలల్లో గుర్తులు, జంతువులు కనిపిస్తాయ్. ఆ జంతువులను, గుర్తులను బట్టి మన మానసిక స్థితిని, మనము ఎదుర్కొంటున్న సమస్యను ముందు అర్ధం చేసుకోవచ్చు.

పైనుంచి కిందపడ్డం..

కలల్లో మనము ఎత్తైన భవనం నుంచి లేదా కొండ నుంచి కిందపడుతున్న భావన కలుగుతుంది. మెట్లపై నుంచి కిందపడుతున్నట్లు కూడా కల కంటాము. అలాంటి కలలు మనకు ఉన్న అభద్రతా భావాన్ని బయటపెడుతుంది. జీవితంలో మనపై మనకు అదుపు లేదని దానర్ధం

కలలో నోటి పళ్లు

కలలకు సంబంధించిన విశ్లేషణలో నోటి పళ్లు పట్టుదలకు సంబంధించిన గుర్తుగా పరిగణించారు. మీ పళ్లు ఊడిపోతున్నట్లు గనగ మీరు కలగంటా దానర్ధం మీరు పట్టుదలను కోల్పోతున్నట్లు, లేదా నిరాశలోకి వెళ్తున్నట్లు సంకేతమని కలల విశ్లేషకులు చెబుతున్నారు.

ఎగురుతున్నట్లు

కలలో ఎగరడం అనేది స్వేచ్ఛకు సంబంధించిన సంకేతాలు గర్తులు. మీరు కలలో ఎగురుతున్నట్లు అనిపిస్తే మీరు మీ జీవితంలో స్వేచ్ఛను పొందుతున్నట్లు అనుకోవచ్చు. మీపై ఎవ్వరూ ఎలాంటి అడ్డంకులు వేయడం లేదని మీరు అర్ధం చేసుకోవాలి.

పాములు

కలల విశ్లేషణలో పాములను శక్తివంతమైన గుర్తులుగా అంచనా వేస్తారు. కలలో పాములు వస్తే అది భయానికి, ఆందోళనకు సంబంధించినదని అనుకోవచ్చు. పాములు కనిపించడమంటే మార్పులు చేసుకోవాల్సిందేనని అంటున్నారు.

కలలు కంటున్నట్లు తెలుసుకోవడం..

కొందరు కలలు కనేసమయంలోనే తాము కల కంటున్నట్లు తెలుసుకుంటారు. ఇలా మీరు మీకలలో చేయగలిగితే కలలో మీరు ఎన్నో అద్భుతాలను చూడవచ్చని కలల నిపుణులు చెబుతున్నారు. దీంతో మీరు మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలను పరిష్కరించుకోగలరని వైద్యులు అంటున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion