యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు..దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా!

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపట్టే ఆరోగ్య సమస్య క్యాన్సర్. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది క్యాన్సర్ తో మరణిస్తున్నారు. మన శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం, వ్యాప్తి చెందడం వల్ల ఇది వస్తుంది. సాధారణంగా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో కణాలు పెరుగుతాయి, చనిపోతాయి. కానీ క్యాన్సర్‌ లో కణాలు అసాధారణంగా పెరుగుతాయి, చనిపోవు. దీని వల్ల కణితి ఏర్పడుతుంది. ఈ కణితులు శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందగలవు, ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ అంటారు.

క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అని చాలా రకాలు ఉంటాయి. అన్ని క్యాన్సర్లలో కేవలం 5-10శాతం మాత్రమే పూర్తిగా వంశపారంపర్యంగా వస్తాయని మిగతావన్నీ పర్యావరణ కారకాల కలయిక వల్ల అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో యువతలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. దీని వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ యువత అజాగ్రత్త కూడా కొంత ఉంది. ఈ నిర్లక్ష్యం వారి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దీంతో చాలామంది చిన్న వయస్సులోనే క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

Cancer cases rising in Youth know reasons and prevention methods

అన్ని క్యాన్సర్లలో సగం కంటే ఎక్కువ నివారించగలవని పరిశోధకులు భావిస్తున్నారు. పొగాకు వాడకం, ఊబకాయం, మద్యపానం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కొన్ని జీవనశైలి కారకాలను నివారించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు

బ్యాడ్ ఆహారపు అలవాట్లు
చాలామంది యువతీ యువకుల్లో ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, స్వీట్ డ్రింక్స్ వినియోగం పెరుగుతోంది. ఈ ఆహారాలు పోషకాలు లేనివి, హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

ధూమపానం, మద్యం
యువతలో ధూమపానం, మద్యం సేవించడం ఫ్యాషన్‌ గా మారిపోయింది. నేటి యువతలో ఎక్కువ మంది ధూమపానం చేస్తున్నారు. ఈ అలవాట్లు ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కారణంగా యువతలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

శారీరక శ్రమ లేకపోవడం
నేటి యువత శారీరక శ్రమల్లో పాల్గొనడం తగ్గిపోతోంది. ఎక్కువ సమయం కంప్యూటర్, మొబైల్, టీవీ ముందు గడుపుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల స్థూలకాయం పెరుగుతుంది..ఇది క్యాన్సర్‌ కు ప్రధాన కారణం.

ఒత్తిడి
యువతలో ఒత్తిడి స్థాయి కూడా పెరుగుతోంది. చదువు, కెరీర్, రిలేషన్ షిప్స్ ఒత్తిడి కారణంగా వారి రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం చాలా ప్రమాదకరం. అందుకే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ లేదా ఏదైనా ఇష్టమైన పనిని చేస్తూ ఉండాలి.

సూర్యుని హానికరమైన కిరణాలు
సూర్యుని హానికరమైన కిరణాలు చాలా హానికరం. ఇది మీ చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. యువత సన్‌స్క్రీన్ వాడటం తక్కువ. సూర్యుని హానికరమైన కిరణాలు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ రాసుకోండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion