వంటింట్లోని సంజీవని..క్యాన్సర్,షుగర్‌ కు యాలకులతో చెక్..లైంగిక సామర్థ్యం పెరుగుతుంది!

మన ఆరోగ్య సమస్యలన్నింటికీ దాదాపు పరిష్కారం మన వంటగదిలోనే ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాధులు కూడా వంటగదిలోని కొన్ని పదార్థాలను వాడితే నయమైపోతుంటాయి. అందుకే వంటగదిని ఔషధ శాల అని కూడా పిలుస్తుంటారు. మన వంటింట్లో ఏది ఉన్నా లేకున్నా యాలకలు తప్పనిసరిగా ఉంటాయి. సాధారణంగా కూరల్లో రుచి కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. పచ్చగా ఉండే యాలకులు.. బిర్యానీ నుండి పాయసం వరకు, టీ నుండి స్వీట్ల వరకు ప్రతీ వంటకానికి ఒక ప్రత్యేకమైన రుచిని, పరిమళాన్ని అందిస్తాయి.

యాలకులు కేవలం ఒక మసాలా దినుసు కాదు, అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజసిద్ధమైన ఔషధం. చూడ్డానికి చిన్నగా ఉన్నా, అది చేసే మేలు అంతా ఇంతా కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేద ట్రీట్మెంట్ లో ఒక సంజీవనిలా ఉపయోగించబడుతున్న యాలకుల వెనుక దాగి ఉన్న అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

Cardamom The King of Flavour and Health

పోషకాల పవర్ హౌస్
యాలకుల్లో రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ సి వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా,మన శరీరానికి అత్యవసరమైన ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలన్నీ కలిసి మన శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా రక్షణ కవచం
ప్రస్తుతం మారిన లైఫ్ స్టైయిల్ కారణంగా చాలామంది క్యాన్సర్ బారినపడుతున్నారు. క్యాన్సర్ లో అనేక రకాలు ఉంటాయి. అయితే యాలకల్లో క్యాన్సర్ ను ఎదుర్కొనే శక్తి ఉంది. యాలకల్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికర కణాలను తొలగిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ కణాల నాశనానికి, క్యాన్సర్ వృద్ధికి కారణమవుతాయి. ముఖ్యంగా పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ కణాలతో పోరాడటంలో యాలకులు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

బరువు తగ్గడానికి చక్కని మార్గం
అధిక బరువుతో బాధపడుతున్న వారికి యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, మన జీవక్రియను వేగవంతం చేసే గుణం ఉంది. ఇది ఆకలిని నియంత్రించి, అనవసరమైన తిండి తినాలనే కోరికను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని యాలకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి, బరువు తగ్గడం సులభమవుతుంది.

మధుమేహం, రక్తపోటు నియంత్రణ
రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పడం మధుమేహానికి దారితీస్తుంది. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. జంతువులపై జరిపిన అధ్యయనాలలో యాలకుల పొడిని ఆహారంలో చేర్చినప్పుడు వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆశ్చర్యకరంగా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. అదేవిధంగా అధిక రక్తపోటు (హై బీపీ) సమస్య ఉన్నవారికి కూడా యాలకులు మేలు చేస్తాయి. ప్రతిరోజూ కేవలం 3 గ్రాముల యాలకుల పొడిని తీసుకున్న వారిలో రక్తపోటు గణనీయంగా తగ్గిందని, వారి శరీరంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు 90శాతం పెరిగాయని ఒక అధ్యయనం తెలిపింది.

Cardamom The King of Flavour and Health

పురుష శక్తి ,సంతాన సాఫల్యత
యాలకులు పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయని చాలాకాలంగా నమ్ముతున్నారు. ఇవి స్పెర్మ్ క్వాలిటీని, స్పెర్మ్ కౌంట్ ను మెరుగుపరచడంలో సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కేవలం పురుషులకే కాకుండా స్త్రీలలో కూడా సంతానోత్పత్తిని పెంచే గుణాలు యాలకులలో ఉన్నాయని నమ్ముతారు. అయితే ఈ విషయంపై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, August 22, 2025, 13:56 [IST]
Desktop Bottom Promotion